పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రంపై సమీక్షను వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుందని.. సెకండాఫ్‌లో కాస్త మార్చి ఉండాల్సిందన్నారు.
18 పేజెస్ టైటిల్ విన్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూసే దాకా అవీ డైరీలోని పేజీలని ప్రేక్షకులకు తెలియదు. ఒక వ్యక్తికి తన కలల సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు సూర్యప్రతాప్.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో. అదే సమయంలో నందిని అనే అమ్మాయి డైరీ చదవడం.. చూడకుండానే ఆమెతో ప్రేమలో పడటం. చిన్న చిన్న ట్విస్టులతో ఫస్టాఫ్ తెరకెక్కించారు. ఫస్టాఫ్ అన్నందుకు క్షమించాలి. అందులో ప్రేమను చూపించి.. సెకండాఫ్ వచ్చేసరికి సామాజిక కోణాన్ని పరిచయం చేశారు. అయితే హీరో, హీరోయిన్స్ ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అనే సీన్స్‌ను కాస్తా అర్థమయ్యేలా చూపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ విషయాన్ని దర్శకుడు సూర్యప్రతాప్‌తో చెప్పా. సమయం లేకపోవడం వల్ల కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు చెప్పారు.'అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment