ఫెయిల్యూర్‌ రాకూడదని పని చేస్తాను | Anil Ravipudi interview (Telugu) about F2 | Sakshi
Sakshi News home page

ఫెయిల్యూర్‌ రాకూడదని పని చేస్తాను

Published Mon, Jan 14 2019 2:53 AM | Last Updated on Mon, Jan 14 2019 2:53 AM

Anil Ravipudi interview (Telugu) about F2 - Sakshi

అనిల్‌ రావిపూడి

‘‘ఎవరైనా సక్సెస్‌ కోసం పని చేస్తారు. నేను ఫెయిల్యూర్‌ రాకూడదని పని చేస్తాను. ఫెయిల్యూర్‌ భయం నాకు ప్రతి క్షణం ఉంటుంది. డైరెక్టర్‌గా నేను సక్సెస్‌ అయ్యాను. రైటర్‌గా ఉన్నప్పుడు నేను చాలా ఫెయిల్యూర్స్‌ చూశా. మనం చేసిన పనికి ప్రశంస రాకపోతే ఉండే బాధను అనుభవించాను. ఇప్పుడు ఆ బాధ లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా’’ అని అనిల్‌ రావిపూడి అన్నారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అనేది ఉపశీర్షిక. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి చెప్పిన విశేషాలు...

► ఈ సినిమాకు ముందు మూడు యాక్షన్‌ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌) చేశాను. యాక్షన్‌ సన్నివేశాలు లేకుండా ఓ ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేద్దామనుకున్నాను. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితె’ తరహాలో ఉండే సినిమా చేద్దామని  ‘ఎఫ్‌ 2’ చేశాను. ‘రాజా ది గ్రేట్‌’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ‘ఎఫ్‌ 2’ ఆలోచన వచ్చింది.
     
► జంధ్యాలగారు గొప్ప రైటర్‌. గొప్ప దర్శకులు. బోర్‌ కొడితే ఆయన సినిమాలు చూస్తాను. ఆయన్ను ఫాలో అవుతాను కానీ ఆయన్ని కాపీ కొట్టను. అలాగే ఈవీవీగారు, కృష్ణారెడ్డిగారి సినిమాలు కూడా బాగా ఇష్టం. వీరిని ఇన్‌ప్లూయెన్స్‌ అవుతున్నానన్న మాట మాత్రం వాస్తవం. కానీ నా స్టైల్‌ ఆఫ్‌ నరేషన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను.
     
► నాది తక్కువ.. నీది ఎక్కువ, ఒకరికి ఎక్కువ డైలాగ్స్‌ ఉన్నాయి. ఒకరికి తక్కువ ఉన్నాయి అన్న  తలనొప్పి నాకు లేదు ఈ సినిమా సెట్‌లో. అందరూ నమ్మి ఈ సినిమా చేశారు. మంచి ఫలితం వచ్చింది. వెంకటేశ్‌గారు కొన్ని ఐడియాస్‌ ఇచ్చారు. సినిమాలో వెంకీ ఆసనం, డాగ్‌ ఎపిసోడ్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. వెంకీగారు గ్రేట్‌ యాక్టర్‌. రిజల్ట్‌ పట్ల ఆయన ఫుల్‌హ్యాపీ. వరుణ్‌ ఇప్పటివరకు కామెడీ జానర్‌ చేయలేదు. వెంకీగారితో వరుణ్‌ కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుందా? అనుకున్నాం. బాగా చేశారు. తెలంగాణ డైలాగ్స్‌ బాగా పలికారు.  సినిమాలో ప్రకాష్‌రాజ్‌గారికి ‘గుండమ్మ కథ’ అంటే ఎంత పిచ్చో నాకు  అంత పిచ్చి. అదే సినిమాలో పెట్టాను. ఈ సినిమాలో ముందుగా ‘అంతేగా..  అంతేగా..’ డైలాగ్స్‌ అనుకోలేదు.
     
► నీ సినిమాల్లో గ్లామర్‌ ఉండదేంటి? అన్నారు కొందరు. అలాంటి ఆడియన్స్‌ కూడా ఉన్నారని రియలైజ్‌ అయ్యి ఈ సినిమాలో కొంచెం గ్లామర్‌ సీన్స్‌ పెంచాను. కానీ బోర్డర్‌ దాటి చేయలేదు.  నా పెళ్లి తర్వాతే రాసుకున్నాను ఈ సినిమా స్క్రిప్ట్‌ని (నవ్వుతూ). నా వైఫ్‌ చూసి చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది.
     
► నేను న్యూస్, కరెంట్‌ అఫైర్స్‌ బాగా ఫాలో అవుతాను. సినిమానే నాకు లైబ్రరీ. సినిమానే నాకు పుస్తకం. అందుకే నేను చేసే సినిమాల్లో కరెంట్‌ అఫైర్స్‌ ట్రెండ్‌ కనిపిస్తుంది. బాల్యంలో ఎంత బాగా చదివేవాడినో అంతే బాగా సినిమాలు చూసేవాడిని. నా గురించి ఇప్పుడు అరుణ్‌ ప్రసాద్‌గారు గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. ఆయన తీసిన ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సి’ సినిమాకు నేను వర్క్‌ చేశాను. ఆయనంటూ లేకపోతే నేనూ ఇండస్ట్రీలో లేను.
     
కాస్త టైమ్‌ తీసుకుని తర్వాత సినిమా స్టార్ట్‌ చేస్తా. బాలకృష్ణ, వెంకటేశ్‌ గార్లకు ఐడియాలు చెప్పాను. బయోపిక్స్‌ పట్ల ఆసక్తి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదు.


► ‘ఎఫ్‌ 3’ చేయాలనే కోరిక ఉంది. ‘ఎఫ్‌ 2’ కి ఆడియన్స్‌ సక్సెస్‌ ఇచ్చారు కాబట్టి నా కోరికకు బలం కూడా వచ్చింది. వెంకీగారు, వరుణ్‌ కూడా ఎగై్జట్‌గా ఉన్నారు. వెంకీగారు, వరుణ్‌కి తోడుగా ఇంకో హీరో వస్తారా? లేక అసలు ఎలా ఉండబోతుందన్న వివరాలు భవిష్యత్‌లో తెలుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement