
శంకర్‌ప్రసాద్, రమణ రాజు, మెహరీన్, రాఘవేంద్రరావు, నాగశౌర్య, ఉషా ముల్పూరి
‘ఛలో, నర్తనశాల’ తర్వాత నాగశౌర్య సొంతబ్యానర్‌లో మూడో సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాకి ఆయనే కథ అందించడం విశేషం. నాగశౌర్య, మెహరీన్ జంటగా రమణ తేజను దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ సినిమా రూపొందనుంది. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించగా, దర్శకుడు పరుశురామ్ గౌరవ దర్శకత్వం వహించారు.
డైరెక్టర్ నందినీరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆశ్వీర్వదించడానికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి, పరుశురామ్, నందినీరెడ్డికి థ్యాంక్స్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 70 శాతం షూటింగ్ వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నాం. మంచి కథను దర్శకుడు బాగా తీస్తారని ఆశిస్తున్నాం. ‘ఛలో’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శౌర్య అన్నయ్యకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు రమణ తేజ. ‘‘నర్తనశాల’ విషయంలో తప్పు చేశాం. ఈ సారి సొంత కథను రాసుకున్నాం. తప్పకుండా హిట్ వస్తుందని కోరుకుంటున్నాం’’ అన్నారు బుజ్జీ. ‘‘మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు మెహరీన్. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: మనోజ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment