సడన్‌గా సంక్రాంతికి రిలీజ్‌ అంటే ఎలా? | F2 - Fun and Frustration trailer release | Sakshi
Sakshi News home page

సడన్‌గా సంక్రాంతికి రిలీజ్‌ అంటే ఎలా?

Published Tue, Jan 8 2019 12:34 AM | Last Updated on Tue, Jan 8 2019 5:12 AM

F2 - Fun and Frustration trailer release - Sakshi

‘దిల్‌’ రాజు, తమన్నా, మెహరీన్, వెంకటేశ్, వరుణ్‌ తేజ్, అనిల్‌ రావిపూడి

‘‘నిన్న ఒక సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో వాళ్లు తొందరపడి స్టేట్‌మెంట్‌ ఇచ్చారేమో నాకు తెలియదు. పండక్కి›వస్తున్న 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్‌ అయ్యాయి. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్‌ ఎలా సెట్‌ చేసుకోవాలని స్ట్రగుల్‌ అవుతున్నాం. అలాంటిది 20 రోజుల ముందు సినిమాను కొనుక్కొచ్చి సంక్రాంతికి రిలీజ్‌ అంటే ఎలా? 3 తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్స్‌ ఎలా అడ్జస్ట్‌ అవుతాయి?’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు.

వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’. (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌). తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ‘దిల్‌’ రాజు నిర్మాత.  ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్‌ కానున్న  సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ చేసి,  ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘రాజా ది గ్రేట్‌’ తర్వాత అనిల్‌ ఈ ఐడియా చెప్పాడుæ. బాగా నచ్చింది. జర్నీ అంతా ఫన్‌గా సాగిపోయింది. మొన్న ఇద్దరం మాట్లాడుకుంటూ ‘ఏంటి అనిల్‌.. 3 సినిమాలు చేసేశాం. చిన్న క్లాష్‌ కూడా రాలేదు’ అని నవ్వుకున్నాం.

తను అనుకున్నట్టు సినిమా చేశాడు. పండక్కి మా సినిమా ఫన్‌ ఇస్తుందని నమ్ముతున్నాం. అలాగే థియేటర్స్‌ ఇష్యూలో రెండో పాయింట్‌..  ఆ నిర్మాతే గత నాలుగు నెలల్లో ‘నవాబ్, సర్కార్‌’ సినిమాలు రిలీజ్‌ చేశారు. ‘సర్కార్‌’కు ఎన్ని థియేటర్స్‌ కావాలో అన్ని థియేటర్స్‌లో వేసుకున్నారు. ఇప్పుడు దొరకడం లేదంటే? తెలుగు సినిమాలను తగ్గించుకుని రిలీజ్‌ చేయలేం కదా. ఈ సీజన్‌లో మన తెలుగు సినిమా కాకుండా వేరే భాష చిత్రాలకు థియేటర్స్‌ ఇచ్చే పరిస్థితి లేదు.

18న రిలీజ్‌ చేయొచ్చుగా? అలా చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్స్‌ దొరుకుతాయిగా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి, నోరు జారారు. అలా మేమూ మాట్లాడగలం. కానీ ఇక్కడ మనం  చేస్తున్నది వ్యాపారం. డబ్బు సంపాదించడానికే. డిస్ట్రిబ్యూషన్‌లో ఎన్నో డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. ఎవరి మీదా స్టేట్‌మెంట్లు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. 6 నెలల క్రితం అనౌన్స్‌ అయిన సినిమాలకు థియేటర్స్‌ ఉండాలా వద్దా? మూడూ క్రేజీ సినిమాలకు థియేటర్స్‌ అడ్జస్ట్‌ చేసుకుంటున్నాం. అది తెలియకుండా స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు’’ అన్నారు.


‘‘ఈ మధ్యలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌’ స్టైల్‌లో ఫుల్‌ కామెడీ సినిమా చేయలేదు. అనిల్‌ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మల్టీస్టారర్‌ అయితే ఇంకా ఫన్‌ ఉంటుందనుకుని చేశాం. వరుణ్‌తో పని చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌.  ఎంటర్‌టైన్‌ చేసిన ప్రతిసారీ నన్ను ఆదరించారు. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్‌. ‘‘నా కెరీర్‌లో చేయాల్సిన కామెడీ అంతా ఈ సినిమాలో చేయించాడు అనిల్‌. ఇలాంటి టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది.

వెంకీగారితో పని చేయాలంటే టెన్షన్‌ పడ్డా. ఫ్రేమ్‌లో ఆయనతో పోటీపడటం పెద్ద చాలెంజ్‌. ఆయన ఇచ్చిన కంఫర్ట్‌ వల్లే బాగా చేయగలిగాను. సీట్లో కూర్చోకుండా సినిమాను ఎంజాయ్‌ చేస్తారు’’ ఆన్నారు వరుణ్‌ తేజ్‌. ‘‘ఈ బ్యానర్‌లో ఇది నాకు మూడో సినిమా. నిర్మాతలు ఫ్యామిలీలా మారిపోయారు. వాళ్లతో ఓ ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పడింది. మా కాంబినేషన్‌ మంచి సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నాను. రెండు నిమిషాల ట్రైలర్‌లో కొన్ని నవ్వులే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో చాలా నవ్వులుంటాయి. వెంకటేశ్, వరుణ్, తమన్నా మెహరీన్‌లు ఈ సినిమాకు 4 పిల్లర్స్‌’’ అన్నారు అనిల్‌ రావిపూడి.

‘‘కెరీర్‌ స్టార్టింగ్‌లో రాజుగారు నాదో సినిమా చూసి డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీడేస్‌’ వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తానా అనుకున్నాను. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌గారు ఓన్లీ ఫన్‌ నో ఫ్రస్ట్రేషన్‌. వెంకీ సార్‌ ఎన్ని పాత్రలు చేసినా అంత ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనిపిస్తారో అర్థం కాదు. వరుణ్‌ చేస్తున్న సినిమాలు నాకు ఇష్టం. మెహరీన్‌ నా హనీ’’ అన్నారు తమన్నా.  ‘‘200 శాతం ఈ సినిమాకు ఇచ్చాను. వెంకటేశ్‌ సార్, వరుణ్, తమన్నాలతో కలసి పని చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. ఫస్ట్‌ టైమ్‌ డబ్బింగ్‌ చెప్పుకున్నాను’’ అన్నారు మెహరీన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement