
వరుణ్‌తేజ్, రాజేంద్రప్రసాద్, అనిల్ రావిపూడి, వెంకటేశ్
సరదాగా కాలక్షేపానికి ప్రాగ్ వెళ్లిన తోడల్లుళ్ల వెకేషన్ ముగిసింది. పది రోజుల పాటు వాళ్ల వాళ్ల జోడీలతో పాటలు పాడుకోవడం కోసం వెళ్లిన వీరు ప్రాగ్‌కి బై బై చెప్పారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా కనిపిస్తారు.‘ఎఫ్ 2’ చిత్రబృందం కొన్ని సీన్స్, సాంగ్స్ కోసం ప్రాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ రీసెంట్‌గా కంప్లీట్ అయింది. ‘‘సక్సెస్‌ఫుల్‌గా ప్రాగ్‌లో షెడ్యూల్‌ని సూపర్ ఫన్‌తో కంప్లీట్ చేశాం’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్, ప్రియదర్శి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment