వెంకటేష్, ‘దిల్’ రాజు, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్
ఫన్ ఒకరిది. ఫ్రస్ట్రేషన్ మరొకరిది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఆడియన్స్‌ది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై అందించేందుకు ‘ఎఫ్2’లో జాయిన్ అవ్వడానికి వీ2 రెడీ అవుతున్నారు. వేసవిలో ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వర్షాకాలంలో షూటింగ్‌కు కొబ్బరికాయకొట్టి చలికాలంలో చిత్రానికి గుమ్మడికాయ కొట్టేలా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.
వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అయితే ఎవరు ఫన్ క్యారెక్టర్ చేయబోతున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్ క్యారెక్టర్‌లో నటించనున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ లోగోను అధికారికంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లు... వీ2 అంటే వెంకీ ప్లస్ వరుణ్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయనున్నారు.‘‘ఎఫ్2’ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సెట్‌లో ఫుల్ ఫన్ స్టార్ట్ అవ్వబోయేది అప్పుడే’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు వెంకీ, వరుణ్, ‘దిల్’ రాజుతో ఉన్న ఫొటోను అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment