
వెంకటేశ్, వరుణ్ తేజ్
సరదాగా ‘ఎఫ్ 2’ సినిమా కోసం కూలీలుగా మారారట వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు కూలీ బ్యాడ్జ్‌లు కట్టుకున్న ఒక ఫొటోను ట్వీటర్‌లో పోస్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో అదే. ఒక బ్యాడ్జ్‌పై ‘కూలీ నెం 1’ అని, మరో బ్యాడ్జ్ పై ‘కూలీ 786’ అని ఉంది. దీంతో ‘కూలీ నెం.1’ వెంకటేశ్ సినిమా కాబట్టి ఆ బ్యాడ్జ్ ఉన్న హ్యాండ్ వెంకీది అని, ‘ఖైదీ నంబర్ 786’ చిరంజీవి సినిమా కాబట్టి ఆ హ్యాండ్ వరుణ్ తేజ్‌ది అని ఊహలు మొదలయ్యాయి. ఏ సీన్ కోసం వెంకీ, వరుణ్ కూలీలుగా మారారు? అన్నదే సస్పెన్స్. ఇందులో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ కూలీలు కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment