మెగా కాంపౌండ్లో చక్కర్లు కొడుతోంది | Mehreen in Allu Sirish New Movie | Sakshi
Sakshi News home page

మెగా కాంపౌండ్లో చక్కర్లు కొడుతోంది

Published Wed, May 11 2016 1:43 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

మెగా కాంపౌండ్లో చక్కర్లు కొడుతోంది

మెగా కాంపౌండ్లో చక్కర్లు కొడుతోంది

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ మెహరీన్. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మకు తరువాత వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే సినిమా సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ, ఆచితూచి అడుగులు వేస్తుంది. వరుసగా ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేస్తూ మెగా కాంపౌండ్ మీద కన్నేసింది.

ఇప్పటికే సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది మెహరీన్. అదే జోరులో మరో మెగా హీరో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలోనూ హీరోయిన్గా నటించడానికి అంగీకరించింది. ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

గౌరవం, కొత్తజంట సినిమాలతో నిరాశపరిచిన శిరీష్, కొంత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది. శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ తరువాత శిరీష్ మెహరీన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా పట్టాలెక్కుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement