
వెంకటేశ్, వరుణ్ తేజ్
బయటికేమో గంభీరంగా కనిపిస్తారు ఈ కో–బ్రదర్స్. కానీ ఇంట్లో మాత్రం భార్యలంటే బెదుర్స్ అంట. మరి ఈ పెళ్లాల టెన్షన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా అని ప్లాన్లు మొదలుపెట్టారు. వెంటనే బ్యాంకాక్ బెస్ట్ ఐడియా అనిపించిందట. దాంతో ఛలో బ్యాంకాక్ అనుకున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని సమాచారం. భార్యలు పెట్టే టెన్షన్‌తో ఫ్రస్ట్రేట్ అయ్యే భర్తలుగా కామెడీ పంచుతారట. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. సుమారు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ బ్యాంకాక్‌లోనే సాగనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment