
వరుణ్ తేజ్, మెహరీన్
హ్యాట్రిక్ హిట్స్‌తో ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ఓ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) రూపొందించనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరు ఫన్ క్రియేట్ చేస్తారు, ఎవరు ఫ్రస్టేట్ అవుతారు అన్న విషయం స్క్రీన్ పైనే తెలుసుకోవాలి.
ఈ సినిమాలో వి (వరుణ్ తేజ్) పక్కన హీరోయిన్‌గా ఎమ్ (మెహరీన్)ను కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య విడుదలైన అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’లో మెహరీనే హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, మెహరీన్ జంటగా యాక్ట్ చేయడం ఇదే తొలిసారి. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment