ఎఫ్‌2 పెయిర్‌ ఫిక్స్‌ | Venky – Varun multi-starrer to commence in June | Sakshi

ఎఫ్‌2 పెయిర్‌ ఫిక్స్‌

Published Tue, May 8 2018 12:21 AM | Last Updated on Tue, May 8 2018 12:21 AM

Venky – Varun multi-starrer to commence in June - Sakshi

వెంకటేశ్, తమన్నా, వరుణ్‌ తేజ్‌, మెహరీన్‌

ఒకరేమో ఫన్నీ. మరొకరు ఫ్రస్ట్రేటింగ్‌. మరి వీళ్లకు జోడి కుదిరితే ఎలా ఉంటుంది? ఒకరు ఫన్నీ పెయిర్‌ అవుతారు. మరొకరు ఫ్రస్ట్రేటింగ్‌ పెయిర్‌లా తయారవుతారు. ఇందులో ఫన్‌ క్రియేట్‌ చేసే ఫన్నీ పెయిర్‌ ఎవరు? ఫ్రస్ట్రేట్‌ అయ్యే ఫ్రస్ట్రేటింగ్‌ పెయిర్‌ ఎవరు? అనే విషయం తెలియాలంటే మాత్రం మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అనిల్‌ రావిపూడి.

వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్‌కు జోడీగా మెహరీన్‌లను ఫిక్స్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఈ ఫన్‌ రైడ్‌లో భాగమైనందుకు సూపర్‌ హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్‌.  జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement