వెంకటేశ్, వరుణ్ తేజ్
సీనియర్స్ ఫస్ట్. ఆ తర్వాతే జూనియర్స్ అంటున్నారు ‘ఎఫ్ 2’ టీమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌లోకి ఫస్ట్ వెంకటేశ్ ఎంటర్ అవుతారు. ఆ వెంటనే వరుణ్ తేజ్ ఎంట్రీ ఇస్తారట ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ జర్నీలోకి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు నిర్మించనున్నారు.
వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ హీరోయిన్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ఫస్ట్ వెంకీ ఎంట్రీ ఇస్తారట. జూలై ఫస్ట్ వీక్‌లో వరుణ్ కూడా జాయిన్ అవుతారట. ఫన్ అండ్ ఫ్రస్ట్రేటింగ్‌గా సాగే ఈ కథలో ఫన్నీ కఫుల్ ఎవరో, ఫ్రస్టేటింగ్ పెయిర్ ఎవరో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకు సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment