
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను, మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, తొలి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీలోని సెకండ్ సింగిల్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
‘ఊ .. ఆ .. అహ అహ’అంటూ ఈ పాట సాగుతోంది. వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలపై ఈ పాటను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రొమో సాంగ్ తమన్నా-మెహరీన్‌లు చీరకట్టులో గ్లామర్‌గా కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment