ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ‘ఎఫ్ 2’లో హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో కామెడీ చేయించారు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరు హీరోలకు తోడు తమన్నా, మెహరీన్, నటుడు రాజేంద్రప్రసాద్ కూడా సందడి చేశారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ అంటూ ఈ కాంబినేషన్ మరింత వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈసారి కీలక తారాగణంలో సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు.
‘ఎఫ్ 2’ని నిర్మించిన ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘వస్తే కొద్దిగా ముందుగా.. వెళ్లినా కొద్దిగా వెనకగా! థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సాయి శ్రీరామ్, కో–ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి.
మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది.
— Sri Venkateswara Creations (@SVC_official) January 29, 2022
మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది!😉
వస్తే, కొద్దిగా ముందుగా.
వెళ్ళినా కొద్దిగా వెనకగా!😊
థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!😎#F3Movie @VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/CHjtB5Ry5S
Comments
Please login to add a commentAdd a comment