
వెంకటేశ్, వరుణ్ తేజ్
‘‘ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. ఈ నెల 12న మా చిత్రం ‘ఎఫ్ 2’టీజర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని వచ్చే ఏడాది వెండితెర సంక్రాంతి అల్లుళ్లు వెంకటేశ్, వరుణ్ తేజ్ గురువారం చాటింపు వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఇందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. త్వరలోనే ఈ సాంగ్‌ను కూడా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్‌లో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. త్వరలో పాటలను విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment