
వరుణ్ తేజ్, వెంకటేష్
‘ఎఫ్ 2’ బ్యాచ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో హంగామా చేస్తున్నారు. మొన్నామధ్యే కదా బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చారు అంటే.. అవును.. కానీ, తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం మళ్లీ అక్కడికే వెళ్లారు. ‘ఎఫ్ 2’ బ్యాచ్ బ్యాంకాక్‌లో చేసిన సందడి ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉప శీర్షిక. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్ నవంబర్ 5 వరకు జరగనుందని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే 15 రోజుల చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుందని సమాచారం. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment