
మెహరీన్, కల్యాణ్ రామ్
‘118’ వంటి హిట్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. మెహరీన్ కథానాయిక. ‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఉమేష్ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ టైటిల్ ప్రకటించినప్పుడు మంచి స్పందన వచ్చింది.
అదే పాజిటివ్ వైబ్స్‌తో అనుకున్న ప్లానింగ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో, నవంబర్‌లో చిక్‌మంగళూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నాం. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథ, మంచిహీరో, మంచి టీమ్, మంచి ఫీల్‌తో ఈ సినిమా చేస్తున్నాం. టైటిల్‌ని బట్టి హీరో పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు సతీష్ వేగేశ్న.
Comments
Please login to add a commentAdd a comment