
నితిన్, మెహరీన్
నితిన్–మెహరీన్ జంటగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో బిజీగా ఉన్నారు నితిన్. ఆ సినిమా పూర్తయ్యాక ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా మెహరీన్ ఎంపికైనట్లు సమాచారం.
ప్రస్తుతం గోపీచంద్‌తో ‘పంతం’, వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల మల్టీస్టారర్ ‘ఎఫ్2’, విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెహరీన్. ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టగానే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు నితిన్. కాగా, ‘ఛల్ మోహన్‌రంగ’ చిత్రంలో నితిన్–మెహరీన్ జంటగా నటించనున్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే మేఘా ఆకాశ్ నాయికగా నటించారు. సో.. అప్పుడు మిస్ అయిన నితిన్–మెహరీన్ జంట ఈసారి ఫిక్స్ అయ్యిందా?
Comments
Please login to add a commentAdd a comment