చాణక్య అన్వేషణ | Chanakya first look release | Sakshi
Sakshi News home page

చాణక్య అన్వేషణ

Published Thu, Jun 13 2019 12:28 AM | Last Updated on Thu, Jun 13 2019 12:28 AM

Chanakya first look release - Sakshi

గోపీచంద్‌

చుట్టూ జనం...వారి మధ్యలో తీక్షణమైన చూపులతో దేన్నో వెతుకుతున్నాడు చాణక్య. ఆ వెతుకులాట ఎందుకు? ఎవరి కోసం అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘చాణక్య’. బుధవారం గోపీచంద్‌ పుట్టినరోజు సందర్భంగా ‘చాణక్య’ సినిమాలోని లుక్‌ను విడుదల చేశారు. ఇక్కడ ఉన్న ఫొటో ఇదే.

ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ నిర్మాతలు. యాభై శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. విశాల్‌ చంద్ర శేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరక్కనున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement