1. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన కథానాయిక ఎవరు?
ఎ) నివేథా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) మెహరీన్ డి) నభా నటేశ్
2.చిరంజీవి 151వ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న తమిళ నటుడెవరో తెలుసా?
ఎ) విజయ్ బి) విజయ్ సేతుపతి సి) ధనుశ్ డి) అజిత్
3. జగపతిబాబు విలన్‌గా టాప్ గేర్‌లో ఉన్నారు. ఆయన విలన్‌గా నటించిన మొదటి సినిమాకు దర్శకుడెవరో తెలుసా?
ఎ) బోయపాటి శ్రీను బి) శ్రీను వైట్ల సి) వంశీ పైడిపల్లి డి) సుకుమార్
4. ‘ఎఫ్ 2’ మల్టీస్టారర్ చిత్రంలో ఓ హీరోగా ప్రముఖ హీరో వెంకటేశ్ నటిస్తున్నారు. మరో హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) అఖిల్ బి) వరుణ్ తేజ్ సి) నాగచైతన్య డి) నాగశౌర్య
5 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) కె.వి. రెడ్డి బి) చిత్రపు నారాయణరావు సి) చిత్తూరు వి.నాగయ్య డి) గూడవల్లి రామబ్రహ్మం
6. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైంది. ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన నటించిన కథానాయిక ఎవరు?
ఎ) విజయనిర్మల బి) విజయ లలిత సి) విజయ శాంతి డి) జయలలిత
7. ‘ అహ నా పెళ్లంట’ చిత్రంలో హాస్యానికి పెద్ద పీట వేశారు దర్శకులు జంధ్యాల. ఈ చిత్రంలో పిసినారి పాత్రలో ఒదిగి పోయిన నటుడెవరో లె లుసా?
ఎ) బ్రహ్మానందం బి) కోట శ్రీనివాసరావు సి) సుత్తి వీరభద్రరావు డి) సుత్తివేలు
8. నాట్య మయూరి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పేరేంటి?
ఎ) అశ్విని బి) మయూరి సి) శారధ డి) శాంభవి
9 ‘‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా’’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) మణిశర్మ బి) దేవీశ్రీ ప్రసాద్ సి) యం.యం.కీరవాణి డి) యస్.యస్. తమన్
10. అనుష్క ‘భాగమతి’ చిత్రంలో ఓ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆమె ఏ ఆఫీసర్‌గా కనిపిస్తారో తెలుసా?
ఎ) పోలీస్ బి) డాక్టర్ సి) టీచర్ డి) కలెక్టర్
11.‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లు’ అని హీరో గోపీచంద్‌ను ఉద్దేశించి పాడే హీరోయిన్ ఎవరు?
ఎ) కాజల్ అగర్వాల్ బి) భావన సి) ప్రియమణి డి) విమలా రామన్
12.‘వి.ఐ.పి 2’ చిత్రంలో హీరో ధనుష్‌తో పోటాపోటీగా నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా?
ఎ) కాజోల్ బి) ఐశ్వర్వారాయ్ సి) కత్రినా కైఫ్ డి) ఆలియా భట్
13. ‘అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తే పడరు... ఇంప్రెస్ అయితేనే పడతారు’ అనే డైలాగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఏ హీరోతో చెప్తుందో కనుక్కోండి? (క్లూ: ఈ డైలాగ్ రచయిత, దర్శకుడు వేగేశ్న సతీశ్)
ఎ) రామ్ బి) శర్వానంద్ సి) అల్లు అర్జున్ డి) సాయిధరమ్ తేజ్
14. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఏంటో తెలుసా?
ఎ) పరమ వీర చక్ర బి) ఎర్రబస్సు సి) మేస్త్రి డి) యంగ్ ఇండియా
15.తొలి భారతీయ చిత్రనిర్మాతగా ప్రసిద్ధి కెక్కిన నిర్మాత ఎవరు?
ఎ) రఘుపతి వెంకయ్యనాయుడు బి)దాదాసాహెబ్ ఫాల్కే సి) హెచ్.యం.రెడ్డి డి) పోతిన శ్రీనివాసరావు
16 .
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్‌గా నటించింది త్రిష. ఆమె స్నేహితురాలిగా నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి?
ఎ) వేదా బి) మధుశాలిని సి) స్వాతి డి) సోనియా
17.మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నవాబ్’ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్ నటించారు. ఆమె ఓ ప్రముఖ తెలుగు నటి మేనకోడలు. ఎవరా నటి?
ఎ) హేమ బి) ప్రగతి సి) శ్రీలక్ష్మీ డి) రజిత
18.‘ముద్దబంతి పూవులో మూగబాసలు... మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు..’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా?
ఎ) చిత్ర బి) పి. సుశీల సి) యస్. జానకి డి) వాణీ జయరాం
19. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఒకప్పటి విశ్వ సుందరి.ఎవరు?
ఎ) సుస్మితాసేన్ బి) ఐశ్వర్యారాయ్ సి) ప్రియాంకాచోప్రా డి) యుక్తాముఖి
20. ‘ఇంద్రజిత్’ చిత్రంలోని ఈ స్టిల్‌లో యస్వీఆర్‌తో ఉన్న హీరోయిన్ ఎవరు?
ఎ) షావుకారు జానకి బి) కృష్ణకుమారి సి) అంజలీదేవి డి) జమున
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు:
1) సి 2) బి 3) ఎ 4) బి 5) డి 6) ఎ 7) బి 8) బి 9) సి 10) డి 11) సి
12) ఎ 13) బి 14) బి 15) బి 16) ఎ 17) సి 18) ఎ 19) ఎ 20) సి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment