
వరుణ్ తేజ్, వెంకటేశ్, మెహరీన్, తమన్నా, అనిల్
ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఫన్ కోసం ప్రాగ్ వెళ్లారు వెంకీ, వరుణ్. ఒంటరిగా వెళ్లలేదు తమ జోడీలను తోడుగా తీసుకెళ్లారు. మరి అక్కడ ఏం చేశారంటే.. వాళ్ల జోడీలతో కలసి డ్యూయెట్ పాడుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2’ పేరుతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ కనిపించనున్నారు. ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రాగ్‌లో జరుగుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్, కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో తోడల్లుళ్లుగా వెంకీ, వరుణŠ. కనిపిస్తే, వాళ్లను ముప్పుతిప్పలు పెట్టే భార్యలుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment