
సంతోష్, భవ్య (ఫైల్)
మైసూరు (కర్ణాటక): మైసూరులోని సాతగళ్లి లేఔట్‌లో నివాసం ఉంటున్న సంతోష్(26), భవ్య(22) అనే యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బుధవారం స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అన్నంలో పురుగుల మందు కలిపి తిన్నట్లు తేలింది. అప్పుల బాధతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..)