
నిజామాబాద్: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దకొడప్‌గల్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రమైసని సంతోష్(25) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment