Mehreen Ex-Fiance MLA Bhavya Bishnoi gets engaged to IAS officer Pari - Sakshi
Sakshi News home page

Bhavya Bishnoi : ఐఏఎస్‌ ఆఫీసర్‌తో భవ్య భిష్ణోయ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌

Published Mon, May 8 2023 3:20 PM | Last Updated on Mon, May 8 2023 4:18 PM

Mehreen Ex Fiance Mla Bhavya Bishnoi Engaged To Ias Officer Pari - Sakshi

హీరోయిన్‌ మెహ్రీన్‌కు ఈమధ్య పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. ఎఫ్-3 సక్సెస్‌ సాధించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్‌గా బరువు తగ్గి బాగా నాజుగ్గా తయారైంది ఈ భామ. గ్లామరస్‌ ఫోటోషూట్‌లతో నెట్టింట రచ్చ చేస్తున్నా చేతిలో సరైన అవకాశాలు లేవు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 మార్చిలో మెహరీన్-భవ్య భిష్ణోయ్‌ నిశ్చితార్థం జైపూర్‌‌లో ఘనంగా జరిగింది.

ఎంగేజ్‌మెంట్‌ అయిన కొద్దిరోజులేక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు. మెహ్రీన్‌ హీరోయిన్‌గా కంటిన్యూ చేస్తుంటే, 2022లో జరిగిన బైపోల్‌ ఎలక్షన్స్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన భవ్య భిష్ణోయ్‌ ప్రస్తుతం హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ పరి భిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement