
ఈ రోజు దేశం నలుమూలల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటేల సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ లుక్ సరికొత్త స్టైల్‌కి నిర్వచనంలో డిఫెరెంట్‌గా దర్శనమిచ్చారు. మన జాతీయత రంగుల మేళవింపుతో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు.
అందరూ మన జాతీయ జెండా రంగుల కలియిక డ్రెస్‌లతో దర్శనమిస్తే ఆయన ఆ రంగుల మేళవింపుతోనే స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మన జాతీయతకు చిహ్నంగా ఉండే రంగులతో ఫ్యాషన్‌గా ఉండొచ్చు అనేలా తలపాగ, కుర్తా-పైజామా ధరించారు. వాటి రంగులు కూడా మన దేశ జెండాని తలపించేలా ఫ్యాషన్‌కి నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ మోదీ రాజస్థానీ లెహరియా తలపాగాను ధరించారు. ఇది ఆకుపచ్చ, నారింజ రంగు మేళవింపుతో దేశ జెండాను గుర్తు తెచ్చేలా హైలెట్‌గా కనిపించింది. అలాగే తెల్లటి కుర్తా, పైజామా, నీలిరంగు జాకెట్ జెండాలోని తెల్లటి రంగు, నీలం రంగులో ఉండే ఆశోక చక్ర రంగుని గుర్తు చేశాయి.
మన దేశం ముక్కోణపు రంగుల మేళవింపుతో కూడిన వేషధారణతో స్టైలిష్‌గా కనిపించడం విశేషం. మన దేశ ప్రధాని ధరించిన శక్తిమంతమై రంగుల కలియిక ఎందరో త్యాగధనుల ఫలితమైన స్వాతత్య్ర వేడకకు అర్థం చెప్పేలా ఉంది. ఇక్కడ ఆయన ధరించి ఐస్ బ్లూ జాకెట్ 200 సంవత్సరాల వలస పాలన తర్వాత మనకు లభించిన స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. ఇక ఆయన ధరించిన తలపాగలోని ఆగుపచ్చ అభివృద్ధి, శ్రేయస్సుని తెలియజేయగా, నారింజ రంగు అమరవీరుల త్యాగాన్ని సూచిస్తోంది.
ఇక తెలుపు రంగు కుర్తా పైజామా శాంతి, స్వచ్ఛతను తెలుపుతోంది. వాటన్నింటి తన వేషధారణతో తెలయజేయడం విశేషం. ఇంతవరకు అందరూ త్రివర్ణ పతాక షేడ్స్‌లో దుస్తులు ధరిస్తే ఆయన ట్రైండ్‌కి తగ్గట్టు సరికొత్త లుక్‌లో కనిపించడం విశేషం. కాగా, గత దశాబ్దం నుంచి మోదీ సాంప్రదాయ రాజస్థానీకి చెందిన బంధేజ్, బంధాని ప్రింట్ టర్బన్‌లు, మల్టీకలర్ టర్బన్‌లు వంటి తలపాగలెన్నో ధరించారు.
#IndependenceDay2024 | PM Modi to address the nation from the ramparts of Red Fort, shortly
(Photo source: PM Modi/YouTube) pic.twitter.com/KggCaY2VRI— ANI (@ANI) August 15, 2024