Fourth Of July: American Independence Day - Sakshi
Sakshi News home page

నేడే ఈనాడే అమెరికా పుట్టిన రోజు.. ఒకప్పుడు అమెరికా సైతం బ్రిటీష్‌ పాలనలోనే

Published Tue, Jul 4 2023 11:03 AM | Last Updated on Tue, Jul 4 2023 12:53 PM

Fourth Of July Americas Independence Day - Sakshi

జూలై 4 అమెరికాకు చాల ప్రత్యేకమైన రోజు. ఆ రోజు అగ్రరాజ్యం బానిస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు. ప్రపంచ రాజకీయాల్లో అన్ని దేశాలను శాసించే అగ్రరాజ్యం సైతం రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్‌ రాజ్యం చేతిలో విలవిలలాడింది. నిజానికి అమెరికా జూలై 04, 1776న స్వాతంత్య్రం పొందినప్పటికీ.. ఈ ప్రక్రియ జరగడానికి రెండు రోజుల క్రితం అనగా జులై 02, 1776 న కాంటినెంటల్‌ కాంగ్రెస్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించేందుకు ఓటింగ్‌ నిర్వహించింది. ఆ రోజున దాదాపు12 అమెరికా కాలనీలు అధికారికంగా బ్రిటీష్‌ పాలన నుంచి విడిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాయి.

అమెరికన్‌ కాలనీలను స్వేచ్ఛ రాష్ట్రాలుగా ప్రకటించిన వారిలో థామస్‌ జెఫెర్సన్‌ ఒకరు. అదే సమయంలో ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, అమెరికా మూడవ అధ్యక్షుడు, రాజకీయ తత్వవేత్త అయిన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ కూడా ఉన్నారు. దీంతో జూలై 04, 1777న అమెరికా కాలనీలు పూర్తి స్థాయిలో అధికారికంగా స్వాతంత్య్రాన్ని పొందాయి. ఇక ఆ రోజు సుమారు 13 గన్‌షాట్‌ల గౌరవ వందనం నిర్వహించి బాణసంచా కాల్చారు. ఆ తర్వాత  ఈ వేడుకలు జూలై 04, 1801లో తొలిసారిగా వైట్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి. ఇక అప్పటి నుంచే అమెరికాలో బాణసంచా కాల్చడం ఒక ఆనవాయితీగా మారింది.

ఆ రాష్ట్రపతి తప్ప అందరూ జరుపుకుంటారు!
అలాగే జూలై 3, 1776న, స్వాతంత్య్ర ప్రకటనపై సంతకం చేయడానికి ఒక రోజు ముందు, వ్యవస్థాపక పితామహులలో ఒకరైన జాన్ ఆడమ్స్ తన భార్య అబిగైల్ ఆడమ్స్‌కు ఈ విషయం చెప్పి.. ఆ రోజును తప్పనిసరిగా "పాంప్ అండ్ పెరేడ్‌, షెవ్స్‌తో జరుపుకోవాలని లేఖ రాశాడు. ఈ రోజున ఆటలు, క్రీడలు, తుపాకుల వందనాలు, ఫైరింగ్‌ వంటి తదితరాలతో.. అమెరికాలో నలుమూలల ఉన్న ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరాడు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను అమెరికన్లు అందరూ ఘనంగా ఆనందంగా నిర్వహించుకోగా ..రాష్ట్రపతి జాన్‌ ఆడమ్స్‌ మాత్రం వీటన్నిటకీ దూరంగా ఉన్నారు.

జాన్ ఆడమ్స్‌ ఈ సెలవురోజుని జరుపుకునేందుకు నిరాకరించారు. అందుకు కారణం అతడు జులై 02 నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా భావించడమేనని కొందరూ చెబుతుంటారు. ప్రస్తుతం అమెరికా 247వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ రోజు కవాతుల ప్రదర్శన, బాణసంచా కాల్పులు, కార్నివాల్‌లు తదితరాలతో అమెరికన్లు పండగ చేసుకుంటారు. రాజకీయ ప్రసంగాలు ఈ వేడుకలో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ రోజు అమెరికన్లు తమ జాతీయ పతాకం రంగుకి అనుగుణంగా నీలం, ఎరుపు, తెలుపు వంటి కలర్‌ఫుల్‌ రంగుల దుస్తులను ధరిస్తారు. 
(చదవండి: ఒక్క రూపాయి తీసుకోకుండా.. వందల కొద్ది బ్రిడ్జ్‌లను నిర్మించాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement