అతిఫ్ అస్లాం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సింగర్ అతిఫ్ అస్లామ్‌పై ఆ దేశ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో అతిఫ్ బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘తేరా హోనే లగా’ ను ఆలపించాడు. ఇది పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ పాక్ సింగర్‌ను ఏకిపారేశారు. పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత్ సాంగ్ ఏంటనీ.. ఇదే నీ దేశ భక్తా? అని ప్రశ్నిస్తున్నారు. అతిఫ్ సాంగ్స్‌ను బహిష్కరించాలని, అతనికి పాక్ అభిమానుల ప్రేమ, ప్రశంసలను పొందే అర్హత లేదని మండిపడుతున్నారు.
పాక్ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక అతిఫ్‌కు మద్దతు తెలిపే అభిమానులు సైతం ఉన్నారు. పాటలకు కూడా సరిహద్దులు ఏంటనీ, దేశాలకు సంబంధం లేకుండా సింగర్స్ పాటలు పాడుతారని అతనికి మద్దతు తెలుపుతున్నారు. మీకు అంతలా కావాలంటే పాక్ సాంగ్సే పాడమని అతనికి చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అనవసర రాద్దంతం చేయవద్దని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment