atif aslam
-
పాక్ గాయకుడిని తీసేసిన సల్మాన్
పుల్వామాలో భారత సైనికులపై దాడిని దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు పాక్ కళాకారులతో కలిసి పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాడు. తాజాగా సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న నోట్‌బుక్ సినిమా నుంచి పాక్ సింగర్ అతీఫ్ అస్లామ్‌ను తొలగించాడు. ఆ పాటను తానే స్వయంగా పాడాలని నిర్ణయించుకున్నాడు సల్మాన్. అంతేకాదు మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా తన తాజా చిత్రం ‘టోటల్ ధమాల్’ను పాకిస్తాన్లో రిలీజ్ చేయనని ప్రకటించారు. పాకిస్తానీ గాయకుడు అతీఫ్ అస్లామ్ -
పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత్ సాంగ్..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సింగర్ అతిఫ్ అస్లామ్‌పై ఆ దేశ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో అతిఫ్ బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘తేరా హోనే లగా’ ను ఆలపించాడు. ఇది పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ పాక్ సింగర్‌ను ఏకిపారేశారు. పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత్ సాంగ్ ఏంటనీ.. ఇదే నీ దేశ భక్తా? అని ప్రశ్నిస్తున్నారు. అతిఫ్ సాంగ్స్‌ను బహిష్కరించాలని, అతనికి పాక్ అభిమానుల ప్రేమ, ప్రశంసలను పొందే అర్హత లేదని మండిపడుతున్నారు. పాక్ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక అతిఫ్కు మద్దతు తెలిపే అభిమానులు సైతం ఉన్నారు. పాటలకు కూడా సరిహద్దులు ఏంటనీ, దేశాలకు సంబంధం లేకుండా సింగర్స్ పాటలు పాడుతారని అతనికి మద్దతు తెలుపుతున్నారు. మీకు అంతలా కావాలంటే పాక్ సాంగ్సే పాడమని అతనికి చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అనవసర రాద్దంతం చేయవద్దని సూచిస్తున్నారు. -
కాస్త కదలండి బాస్
బ్రిగేడ్ రోడ్ మనెకిన్ అంటే బొమ్మ. బట్టల షాపుల్లో కనిపించే మనిషి లాంటి బొమ్మ. ‘మగాళ్లూ! అలా మనెకిన్లా ఉండిపోవద్దు’ అని విజ్ఞప్తి చేస్తూ, కొన్నిరోజులుగా నెట్లో నిమిషమున్నర నిడివిలో ఒక వీడియో కనిపిస్తోంది. కొన్నిరోజులుగా అంటే... బెంగుళూరులో, ఢిల్లీలో కొత్త సంవత్సరం రోజున అమ్మాయిల మీద పడి కొందరు మూకుమ్మడిగా టీజ్ చేసినప్పటి నుండి. టీజ్ చేసిన వారి కంటే కూడా, ఆ రోజు టీజింగ్‌ని మనెకిన్లా చూస్తూ ఉండిపోయినవాళ్లే ఎక్కువ. దీనిపై స్పందిస్తూ ఈ వీడియో అప్లోడ్ అయ్యింది. వీడియో చూడడానికి పెద్ద టైమ్ పట్టదు. చూశాక దానికి గురించి ఎవరు ఎంత టైమ్ ఆలోచిస్తారో తెలియదు. వీడియో ఇలా స్టార్ అవుతుంది! పట్టపగలు ఒక అమ్మాయిని ఒకడు ఈ రెక్కా, ఒకడు ఆ రెక్కా పట్టుకుని టీజ్ చేస్తుంటారు. ఆ అమ్మాయి ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూ ఉంటుంది. చుట్టూ జనం ఉంటారు. చూస్తూ ఉంటారు. చూస్తూ, ఎవరి పనుల్లో వాళ్లు, ఎవరి ఫోన్లలో వాళ్లు ఉంటారు. మొత్తానికి ఆ అమ్మాయి వాళ్లిద్దర్నీ వదిలించుకుంటుంది. ఒక్క క్షణం అలా ఉండిపోతుంది. ఉండిపోయి, స్క్రీన్‌లో నుంచి మనల్ని చూస్తూ ఉంటుంది. మనమూ ఆమెనే చూస్తూ ఉంటాం. కొద్ది క్షణాల తర్వాత ఆ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్‌లోంచి మెల్లిగా మూడు ప్లకార్డ్స్ తీస్తుంది. అవుటాఫ్ 60,000 పీపుల్ హు వర్ ఆన్ బ్రిగేడ్ రోడ్ (మొదటి కార్డు), పాజిబుల్లీ 1000 వర్ మోలెస్టర్స్ (రెండో కార్డు), ది రెస్ట్ 59,000 వర్ మనెకిన్స్ (మూడో కార్డు) అని వాటిపై ఉంటుంది. బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్డులో ఆ రోజు ఉన్నది అరవై వేల మంది అనుకుంటే, వారిలో వెయ్యి మంది టీజ్ చేసినవాళ్లు ఉంటే.. మిగతా యాభై తొమ్మిది వేల మంది బొమ్మల్లా చూస్తుండిపోయినవారు అని ఆ ప్లకార్డ్‌ల సారాంశం. ఆడపిల్లను ఏడిపిస్తుంటే అలా చూస్తూ ఉండిపోకండి అని సందేశం. లోకం మొద్దుబారి పోయిందా?! నడివీధిలో ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ దేశమంతా డిబేట్ జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రదర్శనలు జరుగుతుంటాయి. బయటికి వచ్చే అమ్మాయిలు ఎప్పుడూ తమ దగ్గర పెప్పర్ స్ప్రేలు రెడీగా ఉంచుకోవాలని చెప్పేవారూ ఉంటారు. స్ప్రే ఉంటే సరిపోయిందా, స్ప్రేని కొట్టే ధైర్యం ఉండొద్దా అనేవాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో తెచ్చిన చర్చలోని ఒక యాంగిల్ ఏంటంటే... ‘ఆడపిల్లను ఏడిపిస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. లోకం ఇంకా అంత మొద్దుబారిపోలేదు’ అని. ‘మరి ఆ రోజు బెంగుళూరులో...’ అని ఎవరైనా ఆశ్చర్యంగా ప్రశ్నిస్తే అందుకు సహజంగానే వచ్చిన సమాధానం... అంత రాత్రప్పుడు 2.30 నిమిషాలకు ఒక అమ్మాయిని రక్షించడానికి తాగుబోతులతో ఎవరు తగాదా పడతారు అని! తగాదా పడనవసరం లేదు. ఇక్కడ మేమున్నాం అన్న సంకేతం పంపిస్తే సరిపోతుంది. ఏమైనా ఇదంతా స్పాట్లో ఉన్నవాళ్ల ధైర్యం మీద, స్వభావం మీద, శక్తి మీద, సామర్థ్యం మీద, క్రియాశీలత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక అమ్మాయిని అంత రాత్రప్పుడు కానీ, పట్టపగలు కానీ కాపాడ్డానికి వీటిల్లో ఏ ఒక్కటైనా ఉండాలి మగాళ్లకు. అసలు ఇవేవీ లేకున్నా ఫరవాలేదు... ఆమెను రక్షించాలి అన్న స్పృహ ఉన్నా.. చాలు, ఏం చెయ్యాలో తడుతుంది. పాట ఆపేసిన పాకిస్తానీ సింగర్ అతిఫ్ అస్లామ్ పేరు వినే ఉంటారు. పాకిస్తానీ సింగర్. అతడి పాటలు కూడా వినే ఉంటారు. ఇటీవలే యూట్యూబ్‌లోకి తను, ఇలియానా కలిసి చేసిన ‘పెహ్లీ బార్’ సింగిల్ సాంగ్‌ను అప్లోడ్ చేశాడు. విషయం అది కాదు. జనవరి 14న అతడు పాకిస్థాన్‌లో మ్యూజిక్ కన్సర్ట్ ఇస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్నాడు. మైక్‌లో పాడుతున్నాడు. అర్ధరాత్రయింది. ఆడియన్స్‌లో ఏదో కలకలం. పాడుతూనే అటు వైపు చూశాడు. ఆడియన్స్‌లో ఓ రౌడీ గ్యాంగ్ ఓ అమ్మాయిని టీజ్ చేస్తోంది! అది టీజింగ్ కాదు. వేధింపు. అది గమనించాడు అస్లామ్. వెంటనే పాట ఆపేశాడు. సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలిపించాడు. ఆ రౌడీలను చూపించాడు. వెంటనే వాళ్లు స్టేజి మీది నుంచి కిందికి దూకి ఆ అమ్మాయిని భద్రంగా స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. నో ఫైటింగ్. నో న్యూసెన్స్. నో పోలీస్. నో అనౌన్మెంట్స్. నో వార్నింగ్స్. సింపుల్‌గా ఆ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించారు. ‘మనెకిన్’ సందేశం కూడా ఇదే! అస్లామ్ తను ఉన్నచోటు నుంచి కదల్లేదు. అలాగని ఓ ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేదు. తను ఏం చెయ్యగలడో అది చేశాడు. ఆలోచిస్తే ప్రతి ఒక్కరికీ.. వేధింపుల నుంచి అమ్మాయిని బయట పడేసే ఆలోచన ఏదో ఒకటి తడుతుంది. పెద్దగా అరిచి నలుగురినీ పోగెయ్యొచ్చు. పోలీసులకు ఫోన్ చెయ్యొచ్చు. కాస్త కండబలం ఉన్నవాళ్లయితే... ఆ అమ్మాయి దగ్గరికి అన్నయ్యలానో, ఆప్తుడిలానో వచ్చేయొచ్చు. బహుశా మనెకిన్ వీడియో సందేశం ఇదే కావచ్చు. -
పాట మధ్యలో ఆపేసి.. హీరో అయ్యాడు!
-
పాట మధ్యలో ఆపేసి.. హీరో అయ్యాడు!
అతడో పాకిస్థానీ గాయకుడు. పేరు ఆతిఫ్ అస్లాం. ఓ షోలో పాట పాడుతున్నాడు. అంతలో ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు వేధిస్తుండటాన్ని చూశాడు. అంతే, వెంటనే పాట ఆపేశాడు. వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. ''ఎప్పుడూ అమ్మాయిల మొఖం చూడలేదా? మీకు అక్క - అమ్మ లేరా? వాళ్లు కూడా ఇక్కడ ఉంటే ఏం చేసేవాళ్లు'' అంటూ చెడామడా వాయించేశాడు. ఈ విషయం మొత్తం అక్కడ అతడి షోను చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డయింది. దాంతో ఒక్కసారిగా జనంలో కూడా ఉత్సాహం వెల్లివిరిసింది. 'ఆతిఫ్.. ఆతిఫ్' అంటూ అరవడం మొదలుపెట్టారు. అతడిని అభినందనలలో ముంచెత్తారు. తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, రౌడీలు ఏడిపిస్తున్న అమ్మాయిని భద్రంగా ఇంటివద్ద దించిరమ్మన్నాడు. ఈవ్ టీజర్లకు అతడు బుద్ధి చెప్పిన వైనాన్ని చాలామంది సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. ఆతిఫ్ అస్లాం పాకిస్థాన్‌తో పాటు భారతదేశంలో కూడా బాగా సుప్రసిద్ధ గాయకుడు. ఇలియానాతో కలిసి 'పెహ్లీ దఫా' అనే ఆల్బంలో కనిపించాడు. భారత్ -పాక్ మధ్య సంబంధాలు చెడిపోవడం, పాక్ కళాకారులను ఇక్కడ నిషేధించడం లాంటి ఘటనలు జరుగుతున్న సమయంలోనే అతడి ఆల్బం విడుదలైనా, బాగానే క్లిక్ అయింది. -
నాకు మత బేధాల్లేవ్
ఇండోర్: తనకు మతభేదాలు లేవని ప్రముఖ పాకిస్థాన్‌కు చెందిన సంగీతకారుడు అతిఫ్ అస్లామ్ అన్నారు. ఎవరికోసమైనా తాను సంగీతం అందిస్తానని, హిందువులు, ముస్లింలు అనే బేధం తాను చూపబోనని చెప్పారు. పుణెలో ఓ మ్యూజిక్ ప్రదర్శన కోసం తన బృందంతో దిగిన ఆయనను ఓ హిందూ సంస్థ పాక్ చెందిన ఓ ముస్లిం వ్యక్తి ఇక్కడ సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం లేదని అడ్డుకున్నారు. దీంతో ఆయన మ్యూజిక్ ప్రదర్శన ఆగిపోయింది. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి విద్వేషాలు ఉండవని, మనసునిండ ప్రేమ మాత్రమే ఉంటుందని, భారతీయ అభిమానులకు మ్యూజిక్ పంచేందుకు వచ్చానని చెప్పారు. 'భారతీయ అభిమానులంటే నాకు చాలా ఇష్టం. భారతీయుడిగా ఉండటమన్నా ఇష్టం. నేనొక సంగీతకారుడిని. ఎవరికోసమైన మ్యూజిక్ చేస్తాను. నా వద్ద హిందువులు ముస్లింలు అంటూ కేటగిరీలు ఉండవు. సంగీతానికి హద్దులు లేవు. నేనేం తప్పు చేయడం లేదు. నేను ఇక్కడ ఏం సంపాధించినా దానిని కొంత పన్నుగా కూడా చెల్లిస్తాను' అని ఆయన అన్నారు. అతీఫ్ అస్లామ్ 'జహర్' అనే చిత్రంలో వాహ్ లమ్హే అనే పాటతో 2005లో బాలీవుడ్లో ప్రవేశించారు.