
పుల్వామాలో భారత సైనికులపై దాడిని దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు పాక్ కళాకారులతో కలిసి పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాడు.
తాజాగా సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న నోట్‌బుక్ సినిమా నుంచి పాక్ సింగర్ అతీఫ్ అస్లామ్‌ను తొలగించాడు. ఆ పాటను తానే స్వయంగా పాడాలని నిర్ణయించుకున్నాడు సల్మాన్. అంతేకాదు మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా తన తాజా చిత్రం ‘టోటల్ ధమాల్’ను పాకిస్తాన్‌లో రిలీజ్ చేయనని ప్రకటించారు.
పాకిస్తానీ గాయకుడు అతీఫ్ అస్లామ్
Comments
Please login to add a commentAdd a comment