కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వేలాది మంది హాజరు | India Day Festival And Grand Parade In Toronto Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వేలాది మంది హాజరు

Published Mon, Aug 22 2022 2:46 PM | Last Updated on Mon, Aug 22 2022 3:00 PM

India Day Festival And Grand Parade In Toronto Canada - Sakshi

Azadi Ka Amrit Mahotsav in Canada: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు కెనడాలో వర్చువల్‌గా జరిగాయి. కానీ ఈసారి స్వాతంత్య్ర వేడుకలు కెనడాలోని టోరంటోలోని నాథన్‌​ ఫిలిప్స్‌లో చాలా అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టోరంటోన్‌ నాథన్‌ ఫిలిప్స్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలి వచ్చాయి.

ఈ వేడుకలకు సుమారు పదివేలమందికి పైగా ఇండో కెనడియన్లు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు హాజరయ్యేవారి కోసం ఏర్పాటు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాభప్రేక్షలేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్‌ వైదేహి భగత్‌ భారత్‌లోని మొత్తం కవాతును ఒక చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. 

సుమారు 553 మీటర్ల ఎత్తైన సీఎన్‌ టవర్‌ పై త్రివర్ణ పతాక వెలుగులుతో దేదీప్యమానంగా విరజిమ్మిలా చేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందంటూ భగత్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా కెనడా జాతీయ రక్షణ మంత్రి అనితా ఆనంద్‌ హజరయ్యారు. ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించేందకు కలిసి వచ్చిన ఇండో  కెనడియన్లందరికీ ధన్యావాదాలు అని ట్వీట్‌ చేశారు.

అలాగే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయ కలగకుండా ఉండేలా టోరంటో పోలీసు సిబ్బంది గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా డే పరేడ్, సాంప్రదాయకంగా ఆగస్టు 15 తర్వాత ఆదివారం నిర్వహిస్తారు. అక్కడ ఉండే భారతీయలు ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా ఈ వేడుకులను ఘనంగా నిర్వహించుకుంటారు.

అంతేకాదు ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో నిర్వహించారు. ఈ వేడుకను 22 కమ్యూనిటి సంస్థలు నిర్వహించాయి. సుమారు ఐదు వేల మంది హాజరయ్యారు. అలాగే  గురుకుల ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో దాదాపు 300 వాహనాలతో తిరంగ యాత్ర కార్ ర్యాలీని నిర్వహించింది.

(చదవండి: కిలిమంజారో పర్వతంపై వైఫై.. ఎవరెస్ట్‌పై ఏనాడో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement