India Day parade
-
హీరోయిన్ సమంత అమెరికా వెళ్లింది ఇందుకే!
హీరోయిన్ సమంత.. రీసెంట్గా అమెరికా వెళ్లింది. నార్మల్‌గా అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత కొన్నాళ్ల నుంచి ఓ అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతోంది. దీంతో ఈ టూర్.. చికిత్స కోసమే అని రకరకాల రూమర్స్ వచ్చాయి. మరి ఈ ప్రయాణం వెనక అసలు విషయం ఇప్పుడు తెలిసిపోయింది. ఫొటోలు, వీడియోలు బయటపడటంతో అసలు విషయం బయటపడింది. (ఇదీ చదవండి: అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!) అమెరికాలో సమంత భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయర్క్‌లో 'ఇండియా డే పరేడ్' వేడుకల్ని నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఇవి గ్రాండ్‌గా జరిగాయి. ఇందులోనే హీరోయిన్ సమంత పాల్గొంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సామ్ తోపాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ వేడుకలకు అటెండ్ అయ్యారు. అరుదైన గౌరవం 'ఈ రోజు న్యూయార్క్ లో ఉండటం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవి నేను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయి. ఈ మూమెంట్స్ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ అరుదైన గౌరవం దక్కినందుకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. నా మూవీస్ ఆదరిస్తున్న అమెరికన్ ప్రజలకు ధన్యవాదాలు' అని సమంత చెప్పింది. 'ఇండియా డే పరేడ్' వేడుకల్లో సమంత కంటే ముందు అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన తదితరులు పాల్గొన్నారు. Our Aradhya @Samanthaprabhu2 says do watch #Kushi On 1st September in her speech during Nyc Indian parade 2023 🇮🇳❤️🥳#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/wsw1BcHDKR — SamAnu🦋 (@SamzCraziestFan) August 20, 2023 Superstar @Samanthaprabhu2 in NY 🗽🇮🇳❤️#samantha #samantharuthprabhu #kushi #america #newyork #samanthainamerica pic.twitter.com/ctZWwztfze — SamJam (@SammuVerse) August 21, 2023 (ఇదీ చదవండి: బ్రేకప్స్ గురించి బయటపెట్టిన యాంకర్ రష్మీ) -
అల్లు అర్జున్ హాజరైన ‘ఇండియా డే పరేడ్’కు 2 గిన్నిస్ రికార్డులు
వాషింగ్టన్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరిక, న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్షల్‌గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టినట్లు అక్కడి ప్రవస భారతీయుల సంఘం ఎఫ్ఐఏ తాజాగా వెల్లడించింది. ఒకటి.. అత్యధికంగా వివిధ రకాల జెండాలను ప్రదర్శించటం, రెండోది.. పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించటంపై రికార్డులు సాధించినట్లు పేర్కొంది. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐఏ వెబ్సైట్లో 1500 మందికిపైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. గిన్నిస్ రికార్డులు సాధించటంపై గత ఆదివారం ఓ ప్రకటన చేసింది ఎఫ్ఐఏ. భారత స్వాతంత్య్రం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రికార్డ్‌లకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆగస్టు 15, 21 తేదీల్లో నిర్వహించి వివిధ కార్యక్రమాల కోసం 180 మంది వాలంటీర్ల బృందం అహర్నిశలు కృషి చేసిందని తెలిపింది. న్యూయార్క్‌లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపింది ఎఫ్ఐఏ. మాడిసన్ అవెన్యూలో పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది. భారత్ వెలుపలు దేశ స్వాతంత్య్రంపై చేపట్టిన అతిపెద్ద పరేడ్‌గా గుర్తింపు లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: Allu Arjun: 'భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ'.. పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన బన్నీ -
న్యూయార్క్ గడ్డపై అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం ...(ఫొటోలు)
-
తగ్గేదే లే అంటూ సందడి
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో జరిగిన ‘ఇండియా డే పరేడ్ న్యూయార్క్ 2022’ వేడుకలకు ఈ ఏడాది గ్రాండ్ మార్షల్ హోదాలో అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మేయర్ ఎడిక్ ఆడమ్స్ అల్లు అర్జున్ను సన్మా నించారు. ‘పుష్ప’లోని ‘తగ్గేదే లే’ సిగ్నేచర్ మూమెంట్‌తో సందడి చేశారు అల్లు అర్జున్. ఈ వేడుకలో అల్లు అర్జున్ భార్య స్నేహా పాల్గొన్నారు. పుష్పరాజ్ రూల్ స్టార్ట్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మంచి హిట్ అయింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ఆరంభమైంది. తొలి షాట్‌కి మారిశెట్టి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీమాన్ క్లాప్ కొట్టారు. తోట శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. వీరు ముగ్గురూ సుకుమార్ అసోసియేట్ డైరెక్టర్లు కావడం విశేషం. రష్మికా మందన్నా ఇందులోనూ నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ∙చెర్రీ , రవిశంకర్, సుకుమార్, తబిత, వెంకట్ కిలారు, విజయ్ -
కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వేలాది మంది హాజరు
Azadi Ka Amrit Mahotsav in Canada: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు కెనడాలో వర్చువల్‌గా జరిగాయి. కానీ ఈసారి స్వాతంత్య్ర వేడుకలు కెనడాలోని టోరంటోలోని నాథన్ ఫిలిప్స్‌లో చాలా అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టోరంటోన్ నాథన్ ఫిలిప్స్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలి వచ్చాయి. ఈ వేడుకలకు సుమారు పదివేలమందికి పైగా ఇండో కెనడియన్లు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు హాజరయ్యేవారి కోసం ఏర్పాటు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాభప్రేక్షలేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్ వైదేహి భగత్ భారత్‌లోని మొత్తం కవాతును ఒక చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. సుమారు 553 మీటర్ల ఎత్తైన సీఎన్ టవర్ పై త్రివర్ణ పతాక వెలుగులుతో దేదీప్యమానంగా విరజిమ్మిలా చేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందంటూ భగత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా కెనడా జాతీయ రక్షణ మంత్రి అనితా ఆనంద్ హజరయ్యారు. ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించేందకు కలిసి వచ్చిన ఇండో కెనడియన్లందరికీ ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయ కలగకుండా ఉండేలా టోరంటో పోలీసు సిబ్బంది గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా డే పరేడ్, సాంప్రదాయకంగా ఆగస్టు 15 తర్వాత ఆదివారం నిర్వహిస్తారు. అక్కడ ఉండే భారతీయలు ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా ఈ వేడుకులను ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో నిర్వహించారు. ఈ వేడుకను 22 కమ్యూనిటి సంస్థలు నిర్వహించాయి. సుమారు ఐదు వేల మంది హాజరయ్యారు. అలాగే గురుకుల ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో దాదాపు 300 వాహనాలతో తిరంగ యాత్ర కార్ ర్యాలీని నిర్వహించింది. (చదవండి: కిలిమంజారో పర్వతంపై వైఫై.. ఎవరెస్ట్‌పై ఏనాడో!) -
అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం
-
న్యూయార్క్ ఇండియా పెరేడ్ డేకు అన్నా హజారే
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే, బాలీవుడ్ నటి విద్యాబాలన్ తదితరులు అమెరికాలోని మన్హట్టన్లో జరిగిన అతిపెద్ద ఇండియా డే పెరేడ్‌కు నాయకత్వం వహించారు. న్యూయార్క్ ప్రాంతంలో ఉన్న భారతీయులు వరుసగా 33వ ఏడాది వార్షిక ఇండియా డే పెరేడ్‌ను జరుపుకొన్నారు. పెరేడ్ జరుగుతుండగా. రోడ్డుకు ఇరువైపులా నిలబడి త్రివర్ణ పతాకాలు రెపరెపలాడిస్తూ భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేలాది మంది ఆడుతూ పాడుతూ డ్రమ్ములు వాయిస్తూ, కొంతమంది అయితే ఢోలక్ లాంటి భారతీయ వాయిద్యాలు కూడా వాయిస్తూ పాల్గొన్నారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో గీసిన లైన్లమీద నిలబడిన వేలాది మంది భారతీయ అమెరికన్లు 'అయామ్ అన్నా' అని రాసి ఉన్న టోపీలు ధరించారు. పెరేడ్‌కు హాజరైన ఒక వ్యక్తి అయితే.. త్రివర్ణ తలపాగా ధరించి, దానిమీద మూడు చిన్న చిన్న పతాకాలు కూడా పెట్టుకున్నాడు. న్యూయార్క్‌లోని న్యూ హైడ్ పార్క్ ప్రాంతానికి చెందిన వైష్ణవ్ ఆలయ సభ్యులు 36 మందితో కలిసి ఓ అమెరికన్ జెండా కూడా చేతపట్టుకుని కవాతులో పాల్గొన్నాడు. పెరేడ్లో ఎన్నికైన సభ్యులతో పాటు రాజకీయ పార్టీల అభ్యర్థులు, డెమొక్రాటిక్ పార్టీ అబ్యర్థిని రేష్మా సౌజని, రిపబ్లికన్ మేయర్ అభ్యర్థి జో లోటా తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన జరిగే ప్రైమరీలో విజయం కోసం భారతీయుల మద్దతు పొందేందుకు ఇదే సరైన వేదిక అని వారు భావిస్తున్నారు. తమ మాట ఇప్పుడు మరింత ఎక్కువ మందికి వినిపిస్తుందని భావిస్తున్నట్లు సౌజని తెలిపారు. ఆమె గనక ఈసారి ఎన్నికైతే న్యూయార్క్‌లో తొలి ఎన్నారై రాజకీయ నాయకురాలు అవుతారు. భారతీయులు బయటకొచ్చి ఏం జరుగుతోందో చూడాలని ఆమె పిలుపునిచ్చారు. న్యూయార్క్ నగరంలోని భిన్నత్వమే ఇక్కడి బలమని లోటా అన్నారు. అమెరికాకు వచ్చిన తామంతా ఇక్కడ పండగ చేసుకుంటున్నామని చెప్పారు. భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్, తమిళ నటుడు శరత్ కుమార్, నటి రాధిక తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభ బెల్లును హజారే మోగించనున్నారు.