
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది.
అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఎంపిక చేసిన షావోమీ, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై మొదటి మూడు నెలలు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు షావోమి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. షావోమి ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తన సబ్-బ్రాండ్‌లలో ఒకటైన పోకో కూడా ఇదే ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తోంది. సో..యూట్యూబ్ ప్రీమియం ఉచిత ఆఫర్‌ను ఇప్పటికే పొందినట్లయితే, షావోమీ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ ఆఫర్‌ను పొందేందుకు అర్హుల కారు అనేది గమనించాలి.
షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ కొనుగోలుపై మూడు నెలలు, అలాగే రెడ్‌మి నోట్ 11, నోట్ 11 ఎస్ లాంటి కొన్ని స్మార్ట్‌ఫోన్లపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్రిప్షన్ ఉచితం. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది.
కాగా యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఇదే చౌకగా లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment