ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్ మీ సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. భారత్ వేదికగా జరిగిన లాంచ్ ఈవెంట్‌లో టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో 5జీ రెడ్‌మీ నోట్ 11 ప్రో+, 4జీ రెడ్ మీ నోట్ ప్రో స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది.
4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో , 5జీ నోట్ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు
రెడ్ మీ నోట్ 11 ప్రో 4జీ, నోటీ 11 ప్రో ప్లస్ 5జీ ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లలో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే,120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపీ సెల్ఫీ కెమెరాకు పంచ్ హోల్ కటౌవుట్, 180 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ స్నాపర్స్, 2ఎంపీ మైక్రో హెల్పర్, 2ఎంపీ డెప్త్ మాడ్యుల్స్ ఉన్నాయి.
5జీ షావోమీ రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్
5జీ రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో రిలీజైతే.. 4జీ రెడ్‌మీ నోట్ 11 ప్రో మాత్రం ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో రిలీజైంది.
5జీ షావోమీ రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.24,999 వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్ షావోమీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అమెజాన్ ఇండియా ద్వారా మార్చి 15నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
4జీ రెడ్ మీ నోట్ 11
4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 17,999 నుంచి ప్రారంభం కానుండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి.
చదవండి: ఫ్లిప్ కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!!
Comments
Please login to add a commentAdd a comment