
ఫ్లిప్‌కార్ట్ మరోసారి పండుగ ఉత్సవాన్ని ప్రారంభించబోతుంది. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 17 వరకు నాలుగు రోజుల పాటు బిగ్ దివాలి సేల్‌ను నిర్వహించబోతుంది. ఈ సేల్‌లో భాగంగా పలు కేటగిరీలోని ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రీమియం, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ డీల్స్‌ను కూడా ప్రకటించింది. అంతేకాక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లందరికీ అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందించనున్నట్టు తెలిపింది.
ఈ దివాలి సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపును, టెలివిజన్, అప్లియెన్స్‌పై సుమారు 70 శాతం, ఫ్యాషన్, దుస్తుల విభాగంపై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుంది. షావోమి, మోటోరోలా, లెనోవో, శాంసంగ్, ఆపిల్ ఫోన్లతో పాటు బడ్జెట్, ప్రీమియం ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఫోన్లపై 50 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇటీవల కొత్తగా లాంచ్ అయిన హానర్ 9ఐ తొలిసారి అక్టోబర్ 14 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment