బిగ్‌ డీల్స్‌: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్‌ 5జీ ఫోన్‌లు! | best 5G Phone Deals Under Rs 15000 in Flipkart Big Diwali Sale | Sakshi
Sakshi News home page

బిగ్‌ డీల్స్‌: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్‌ 5జీ ఫోన్‌లు!

Nov 2 2023 5:49 PM | Updated on Nov 2 2023 7:44 PM

best 5G Phone Deals Under Rs 15000 in Flipkart Big Diwali Sale - Sakshi

దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్‌లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. 

ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ దీపావళి సేల్‌లో 5జీ ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్‌ల 5జీ ఫోన్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్‌, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్‌ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం14 5జీ
శాంసంగ్‌ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్‌లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్‌ ఉంటుంది. రెండు ఫోన్‌లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి.  అయితే వీటికి ఛార్జర్‌ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్‌ రూ. 11,967కి అందుబాటులో ఉండగా,  శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 ధర రూ.11,490 ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది.

ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ
ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్‌ ఉన్న ఈ ఫోన్‌ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది.

పోకో ఎం6 ప్రో 5జీ
రూ. 10 వేల లోపు సెగ్మెంట్‌లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్‌ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఆశించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement