big deals
-
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఆశించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం బలపడి రూ. 3,983 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 3,599 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసికవారీగా అంటే గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 4,096 కోట్లతో పోలిస్తే నికర లాభం 3 శాతం తగ్గింది. కాగా.. ఈ క్యూ4లో మొత్తం ఆదాయం 18 శాతం ఎగసి రూ. 26,606 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 22,597 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 10 శాతం మెరుగై రూ. 14,845 కోట్లను తాకింది. 2021–22లో రూ. 13,499 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. లక్ష కోట్లను దాటి రూ. 1,01,456 కోట్లకు చేరింది! అంతక్రితం ఏడాది రూ. 85,651 కోట్ల ఆదాయం అందుకుంది. భారీ డీల్స్ అప్ క్యూ4లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 13 భారీ డీల్స్ గెలుచుకుంది. వీటి విలువ 207.4 కోట్ల డాలర్లుకాగా.. వార్షికంగా 18 శాతం క్షీణించింది. ఈ కాలంలో కంపెనీ 3,674 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,25,944కు చేరింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 19.5 శాతంగా నమోదైంది. డీల్ పైప్‌లైన్ దాదాపు కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు కంపెనీ సీఈవో విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గైడెన్స్ గుడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 6–8 శాతం వృద్ధి చెందగలదని హెచ్‌సీఎల్ టెక్ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున డివిడెండును ప్రకటించింది. వరుసగా 81వ త్రైమాసికంలోనూ డివిడెండును చెల్లిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,037 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్–ఉబర్ భారీ డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో భారీ డీల్‌కు వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్, రైడ్ షేరింగ్ యాప్ ఉబర్ తెరలేపాయి. ఇరు సంస్థల మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25,000 యూనిట్ల ఎక్స్‌ప్రెస్–టి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాలను ఉబర్‌కు టాటా మోటార్స్ సరఫరా చేయనుంది. ఎక్స్‌ప్రెస్–టి ఈవీలను ప్రీమియం సేవల కింద ఉపయోగించనున్నట్టు ఉబర్ వెల్లడించింది. హైదరాబాద్‌సహా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఈ నెల నుంచే వీటిని నడుపుతామని తెలిపింది. దశలవారీగా డెలివరీలు.. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్ సరఫరా విషయంలో వాహన తయారీ కంపెనీ, రైడ్ షేరింగ్ సంస్థ మధ్య దేశంలో ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి నుంచే దశలవారీగా ఉబర్ ఫ్లీట్ పార్ట్నర్స్కు డెలివరీలను టాటా మోటార్స్ ప్రారంభించనుంది. దేశంలో పర్యావరణ, స్వచ్ఛ వాహనాల వినియోగం పెరిగేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేశ్ చంద్ర అన్నారు. ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌ను టాటా మోటార్స్ 2021 జూలైలో తెచ్చింది. ఈ బ్రాండ్ కింద ఎక్స్‌ప్రెస్–టి తొలి ఉత్పాదన. ఫేమ్ సబ్సిడీ పోను హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధర.. ఎక్స్‌ప్రెస్–టి ఎక్స్ఎమ్ ప్లస్ రూ.13.04 లక్షలు, ఎక్స్‌టీ ప్లస్ రూ.13.54 లక్షలు ఉంది. -
నోకియాతో జియో బిగ్ డీల్..
-
అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్‌లు ప్రకటించాయి. వెరసి సిమెంట్ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్ ప్లాంట్లు, కోల్ మైన్స్ నిర్వహించే అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీవైపు దృష్టిసారించింది. ఈ బాటలో సిమెంట్ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ దేశీయంగా సిమెంట్ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. కాగా.. సిమెంట్ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతోపాటు.. అల్ట్రాటెక్ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. డీల్ వివరాలివీ.. ► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్ ఇండియా అంబుజా సిమెంట్స్‌లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ► అంబుజా సిమెంట్‌కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్‌కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించనుంది. ► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. ► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల ప్రస్తుత సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షికంగా 119.95 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. దిగ్గజాల తీరిదీ ► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్) విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ► అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది. ► 2015లో ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్తో హోల్సిమ్ విలీనమైంది. లఫార్జ్హోల్సిమ్గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్‌లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది. క్వింటిలియన్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 49 శాతం వాటా కొనుగోలు డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్(క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్(క్యూఎంఎల్)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలుకి క్వింట్ డిజిటల్ మీడియా(క్యూడీఎంఎల్)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్ బల్ కంపెనీ క్యూబీఎంఎల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. క్యూబీఎంఎల్.. బ్లూమ్బెర్గ్క్వింట్ పేరుతో బిజినెస్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ కోసమే అదానీ గ్రూప్‌తో డీల్‌ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్ తెలిపింది. కాగా, డీల్ విలువ తెలియలేదు., మార్గదర్శనం దేశీయంగా మా బిజినెస్‌లను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్ నాయకత్వం వహించగలదు. – జాన్ జెనిష్, సీఈవో, హోల్సిమ్ లిమిటెడ్ వృద్ధిపై విశ్వాసం సిమెంట్ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్. -
లేడీబాస్.. మెగా డీల్
న్యూఢిల్లీ: లేడీబాస్ కిరన్ మజుందార్‌షా నేృతృత్వంలోని ఔషధాలు, ఆరోగ్య సేవల రంగంలో దూసుకెళ్తోన్న బయోకాన్ భారీ డీల్‌కు తెరలేపింది. యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బయోకాన్ బయోలాజిక్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.25,140 కోట్లు. ఇందులో నగదుతోపాటు బయోకాన్ బయోలాజిక్స్కు చెందిన రూ.7,550 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్‌ను వయాట్రిస్‌కు జారీ చేస్తారు. కంపెనీలో ఇది 12.9 శాతం ఈక్విటీకి సమానం. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డు ఈ లావాదేవీని ఆమోదించింది. 2022 జూలై–డిసెంబర్ మధ్య డీల్ పూర్తి కానుంది. ఒప్పందంలో భాగంగా వయాట్రిస్ అంతర్జాతీయ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని బయోకాన్ బయోలాజిక్స్ దక్కించుకుంటుంది. దానితో పాటు లైసెన్స్ పొందిన బయోసిమిలర్స్ ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా చేజిక్కించుకుంటుంది. రెండేళ్లలో ఐపీవోకు..: ఈ వ్యూహాత్మక కలయిక రెండు భాగస్వాముల పరిపూర్ణమైన సామర్థ్యాలు, బలాలను ఒకచోట చేర్చుతుందని బయోకాన్ బయోలాజిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ సందర్భంగా తెలిపారు. ‘యూఎస్, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మార్కెట్లలో బయోకాన్ బయోలాజిక్స్ ఒక బలమైన వాణిజ్య వేదికను పొందేందుకు, ప్రపంచ బ్రాండ్‌ను నిర్మించేందుకు, సంస్థ ప్రయాణాన్ని వేగిరం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. బయోకాన్ బయోలాజిక్స్ రెండేళ్లలో ఐపీవోకు రానుంది. తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ.60,400 కోట్లకు చేరుతుంది. ఐపీవో చాలా ఆకర్షణీయమైన స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. వాటాదార్లకు భారీగా విలువను సృష్టించబోతోంది. వయాట్రిస్ డీల్‌తో బయోసిమిలర్స్ రంగంలో బయోకాన్ బయోలాజిక్స్ లీడర్‌గా మారడానికి సహాయపడుతుంది. 2020–21లో రూ.2,900 కోట్ల ఆదాయం ఆర్జించాం’ అని వివరించారు. సుమారు రూ.7,550 కోట్లు.. వయాట్రిస్ బయోసిమిలర్స్ ఆదాయం వచ్చే ఏడాది సుమారు రూ.7,550 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డీల్ కారణంగా బయోకాన్ ప్రస్తుత శ్రేణి వాణిజ్యీకరించిన ఇన్సులిన్లు, ఆంకాలజీ, ఇమ్యునాలజీ బయోసిమిలర్స్తోపాటు అభివృద్ధిలో ఉన్న అనేక ఇతర బయోసిమిలర్స్ ఆస్తులతో కూడిన సమగ్ర పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటానికి సాయపడుతుంది. ప్రస్తుతం 20 బయోసిమిలర్స్ పోర్ట్‌ఫోలియోను బయోకాన్ ఖాతాలో ఉంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్‌తో గతంలో ప్రకటించిన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ పోర్ట్‌ఫోలియో సైతం తన ఖాతాకు జోడించింది. అంతర్జాతీయ బయోసిమిలర్స్ రంగంలో ధరల ఒత్తిడిని తగ్గించడంలో ఈ డీల్ సహాయపడుతుందని బయోకాన్ బయాలాజిక్స్ ఎండీ అరుణ్ చందవర్కర్ తెలిపారు. -
రూ.235 కోట్లతో అతి పెద్ద రియల్టీ డీల్ హైదరాబాద్‌లో..
Indian Real Estate Big Deals In 2021: కరోనా సంక్షోభం చుట్టు ముట్టినా ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా తగ్గేదేలే అంటోంది హైదరాబాద్‌లో రియాల్టీ బూమ్. దేశంలో ఉన్న ఇతర ప్రధాన మెట్రో సిటీస్‌ని వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది దేశంలోనే అతి పెద్ద రియల్టీ డీల్‌కి హైదరాబాద్ వేదికగా మారింది. రూ.235 కోట్లు సింగిల్ బిట్ ప్లాట్‌కి సంబంధించి దేశంలోనే అతి పెద్ద రియల్టీ డీల్ ఇటీవల హైదరాబాద్‌లో ఖరారైంది. నగరానికి చెందిన అశోక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూకట్పల్లి సమీపంలో సింగిల్ బిట్‌గా ఉన్న పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు రికార్డు స్థాయిలో రూ. 235 కోట్లను వెచ్చించింది అశోక్ బిల్డర్స్. ఈ డీల్‌కి ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ సంధానకర్తగా వ్యవహరించింది. మరో 250 కోట్లు తాజాగా కొనుగోలు చేసిన స్థలంలో మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టు అశోక్ బిల్డర్స్ తెలిపారు. ఇందులో రెసిడెన్షియల్ జోన్‌తో పాటు గ్రేడ్ ఏ కమర్షియల స్పేస్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందు కోసం మరో రూ.250 కోట్లు వెచ్చించబోతున్నారు. ఈ ప్రాజెక్టును 2025 చివరికల్లా అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమన్నారు. అప్పటికల్లా ఈ ప్రాజెక్ట్ వ్యాల్యూ రూ.600 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది అశోక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. చదవండి:Container Homes: ఇళ్ల నిర్మాణంలో కొత్త ట్రెండ్ -
డీల్ స్ట్రీట్‌లో డాన్.. రిలయన్స్
ముంబై: కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. రిలయన్స్ కారణంగా భారీ డీల్స్ కుదిరాయంటున్న ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే..., ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డీల్స్ 7 శాతం వృద్ధితో 8,000 కోట్ల డాలర్లకు పెరిగాయి. మొత్తం 1,268 లావాదేవీలు జరిగాయి. ► దీంట్లో మూడో వంతుకు పైగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డీల్స్ ఉన్నాయి. ► రిలయన్స్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో 1,020 కోట్ల డాలర్లు సాధించింది. ఇక రిటైల్ విభాగం కూడా వేల కోట్ల ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను ఆకర్షించింది. ► ఈ ఏడాది జరిగిన మొత్తం డీల్స్‌లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ వాటా దాదాపు సగంగా ఉంది. ఇక ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) లావాదేవీలు గత ఏడాది మాదిరిగానే 3,820 కోట్ల డాలర్ల రేంజ్లో ఉన్నాయి. ► ఈ ఏడాది ఆరంభంలో టెలికం రంగంలో భారీ డీల్స్ వచ్చాయి. ఆ తర్వాత కరోనా కల్లోలం చెలరేగడంతో పలు సంస్థల తమ ఒప్పందాలను వాయిదా వేశాయి. పలు పీఈ ఫండ్స్ కూడా వేచి చూసే ధోరణిని అవలంభించాయి. ► దేశీయ డీల్స్ పరంగా చూస్తే, రిలయన్స్ రిటైల్–ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందమే పెద్దది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ 330 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ► విదేశీ సంస్థల డీల్స్ ఈ ఏడాది 11 శాతం పెరిగాయి. రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటా కోసం ఫేస్బుక్ సంస్థ 570 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. లాక్డౌన్ కాలంలో జరిగిన అతి పెద్ద డీల్ ఇదే. ► ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి 3,000 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఎఫ్‌డీఐలతో పోల్చితే ఇది 15 శాతం అధికం. ► రిలయన్స్ వల్లనే అధికంగా పీఈ డీల్స్ జరిగాయి. ఫేస్బుక్, టీపీజీ, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ తదితర పీఈ ఫండ్స్, సావరిన్ ఫండ్స్ రిలయన్స్ జియోలో 980 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాది పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇది 66 శాతానికి సమానం. రిలయన్స్ రిటైల్ వెంచర్లో 510 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈ ఏడాది మొత్తం పీఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ 1,500 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. ఇది రికార్డ్ స్థాయి. ► ఈ ఏడాది అత్యధిక నిధులు ఆకర్షించిన రంగంగా టెలికం నిలిచింది. ఈ రంగంలోకి మొత్తం 1,120 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక రిటైల్ రంగంలో 650 కోట్ల డాలర్లు, టెక్నాలజీ రంగంలో 600 కోట్ల డాలర్లు, ఫార్మాలో 250 కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► వాటాలను విక్రయించి వివిధ సంస్థల నుంచి పీఈ సంస్థలు వైదొలగడం గత ఐదేళ్లలోనే అత్యంత కనిష్టానికి ఈ ఏడాది పడిపోయింది. స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉండటమే దీనికి కారణం. ఈ వాటాల విక్రయం పరంగా చూస్తే, మొత్తం 420 కోట్ల డాలర్ల విలువైన 136 లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది డీల్స్‌తో పోల్చితే 56 శాతం తక్కువ. (విలువ పరంగా) -
జియో మరో భారీ డీల్
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కు చెందిన రిలయన్స్ జియో మరో భారీ డీల్ సాదించింది. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 750 మిలియన్ డాలర్లకు (రూ. 5,655 కోట్ల) 1.15 శాతం జియో వాటాలను కొనుగోలు చేసింది. 9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్బుక్ 5.7 బిలియన్ డాలర్ల మెగా డీల్ చేసుకున్న వారం రోజుల తరువాత జియో మరో మెగా డీల్ సాధించడం విశేషం. దీనిపై ఇరు సంస్థలు సంతోషాన్ని వ్యక్తం చేసాయి. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర సంబంధిత చట్ట అనుమతులను పొందాల్సి వుంది. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా రికార్డున్న సిల్వర్ లేక్ భాగస్వామ్యం సంతోషాన్ని స్తోందన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామమని పేర్కొన్నారు.మరోవైపు అత్యంతముఖ్యమైన సంస్థలలో ఒకటిగా జియోను అభివర్ణించిన సిల్వర్ లేక్ కో సీఈఓ ఎగాన్ డర్బన్ చాలా బలమైన, వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో నడుస్తున్న సంస్థతో భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. (లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్) ఫేస్బుక్ పెట్టుబడితో పాటు, ఆర్ఐఎల్ ఇతర వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారుల భారీ ఆసక్తి నెలకొందని, రాబోయే నెలల్లో ఇదే తరహా పెట్టుబడిని సాధించనున్నామని ఏప్రిల్ 30న త్రైమాసిక, వార్షికఫలితాల సందర్బంగా రిలయన్స్ ప్రకటించింది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) (జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్) -
జియోకు ఫేస్బుక్.. లైక్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు రిలయన్స్ గ్రూప్, ఫేస్బుక్ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఈ–కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్‌కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ. 43,574 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా అందులో అతి పెద్ద మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటాం‘ అని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.62 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ప్రకటనలో పేర్కొంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. సాధారణంగా మీడియా, ఆన్లైన్ సంస్థల్లోనే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తున్న ఫేస్బుక్ తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ పేమెంట్, ఈ–కామర్స్ విభాగాల్లోని భారీ వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునే వ్యూహంలో ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. డీల్ ఇలా.. డీల్ ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్.. ఫేస్‌బుక్‌కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్ గ్రూప్ గతేడాది అక్టోబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్–ఎక్స్‌క్లూజివ్ డీల్‌గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కాగా, ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది. రిలయన్స్‌కు ప్రయోజనాలు.. గతేడాది డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్‌గా ఆవిర్భవించాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్బుక్ డీల్‌తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్‌కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. జియో డిజిటల్‌కు ఊతం: విశ్లేషకులు డిజిటల్ వ్యాపార విభాగాల ద్వారా ఆదాయార్జన, 2021 నాటికి రుణరహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ లక్ష్యాల సాకారానికి ఫేస్బుక్ డీల్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‘రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ విభాగం .. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ పరిధిలో లేదు. వాట్సాప్‌తో జట్టు కట్టడం ద్వారా కిరాణా దుకాణదారు, కొనుగోలుదార్లను అనుసంధానం చేయొచ్చు‘ అని క్రెడిట్ సూసీ ఒక నివేదికలో పేర్కొంది. ఇది రెండు పక్షాలకూ వ్యూహాత్మక ఒప్పందమని బెర్న్‌స్టెయిన్ తెలిపింది. ‘ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ డీల్‌తో వుయ్‌చాట్ లాంటి యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 38 కోట్ల పైచిలుకు యూజర్లు ఫేస్‌బుక్‌కు లభిస్తారు. జియోమార్ట్‌లోని 6 కోట్ల చిన్న వర్తకులతో పాటు జియో కస్టమర్లకూ కొత్త సొల్యూషన్స్ అందించవచ్చు’ అని వివరించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్ .. ఈ డీల్ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్ వివరించింది. ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్‌కు ప్రయోజనాలు.. గతేడాది డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొత్తం రుణభారం రూ. 3,06,851 కోట్లుగా ఉంది. చేతిలో నగదు రూ. 1,53,719 కోట్లు ఉండటంతో నికర రుణ భారం రూ. 1,53,132 కోట్లుగా ఉండనుంది. 2021 నాటికల్లా రుణ రహిత గ్రూప్‌గా ఆవిర్భవించాలని రిలయన్స్ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తమ చమురు, రసాయనాల వ్యాపార విభాగాల్లో 20 శాతం వాటాను చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కోకు విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించే ప్రయతాల్లో ఉంది. ఇప్పటికే ఇంధన రిటైల్ విభాగంలో వాటాలను బ్రిటన్ సంస్థ బీపీకి రూ. 7,000 కోట్లకు విక్రయించింది. తాజాగా ఫేస్బుక్ డీల్‌తో రుణ భారం తగ్గించుకునే దిశగా మరో అడుగు ముందుకు పడినట్లయింది. అలాగే, టెక్నాలజీలో ఫేస్బుక్ అనుభవం, నైపుణ్యాల ఊతంతో జియోను భారీ డిజిటల్ కంపెనీగా తీర్చిదిద్దేందుకు రిలయన్స్‌కు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఫేస్‌బుక్‌కు ఏంటి... కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2017లో దేశీయంగా 45 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2022 నాటికి 85 కోట్లకు పెరగనుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు భారత్‌లో 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, అందులో భాగమైన వాట్సాప్‌నకు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరో విభాగం ఇన్‌స్ట్రాగామ్‌కు కూడా ఇబ్బడిముబ్బడిగా యూజర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇక టెలికం కార్యకలాపాలు సాగిస్తున్న జియోకు 38.8 కోట్ల పైగా ఫోన్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. జియోతో జట్టు కట్టడం ద్వారా కోట్ల కొద్దీ యూజర్లకు మరింతగా చేరువ కావడానికి ఫేస్‌బుక్‌కి ఈ డీల్ ఉపయోగపడనుంది. పేమెంట్ సర్వీసులను కూడా ప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ఫేస్‌బుక్‌కు స్థానికంగా ఒక భాగస్వామి ఉంటే నియంత్రణలపరమైన అడ్డంకులను అధిగమించేందుకు.. ప్రైవసీ, లోకల్ స్టోరేజీ నిబంధనల పాటించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్య.. వైద్యంలోకి విస్తరణ: అంబానీ ఫేస్బుక్ భాగస్వామ్యంతో భారీ వ్యాపార ప్రణాళికలను ఆవిష్కరించారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కొనుగోలుదారుల ఇళ్లకే సరుకులు చేర్చడం మొదలుకుని క్రమంగా విద్య, వైద్య రంగాల్లోకి కూడా విస్తరించబోతున్నామని వెల్లడించారు. ‘రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలపడం ద్వారా ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే కొంగొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయి. జియోమార్ట్, వాట్సాప్ భాగస్వామ్యం వల్ల.. సమీప భవిష్యత్‌లో ఇరుగుపొరుగుల్లో ఉండే ప్రతి కస్టమరుతో డిజిటల్ లావాదేవీలు జరిపేలా దాదాపు 3 కోట్ల పైచిలుకు చిన్న స్థాయి కిరాణా దుకాణదారులకు తోడ్పాటు లభిస్తుంది. అంతేకాదు.. ఈ విజయవంతమైన భాగస్వామ్యంతో మన రైతులు, చిన్న.. మధ్య తరహా సంస్థలు, మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సేవలందించేవారు .. అందరికన్నా ముఖ్యంగా నవభారతానికి వెన్నెముకలాంటి యువత, మహిళలకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ప్రపంచంలోనే అగ్రగామి డిజిటల్ దేశంగా భారత్ ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది ‘ అని సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. జియోతో జట్టు... మరిన్ని అవకాశాలు లక్షలాది మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లోకి రావడానికి జియో వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకైనా చిన్న వ్యాపారాలు చాలా కీలకం. భారత్‌లో 6 కోట్లకు పైగా చిన్న వ్యాపార సంస్థలున్నాయి. కోట్లాదిమంది ప్రజలు ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచమంతా లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో వ్యాపార వృద్ధి, వినియోగదారులతో సంబంధాల నిమిత్తం ఈ వ్యాపార సంస్థలకు డిజిటల్ టూల్స్ అవసరం. ఈ డిజిటల్ టూల్స్ అందించడం కోసమే జియోతో జట్టు కట్టాం. రిలయన్స్‌తో మా భాగస్వామ్యం... భారత్‌లోని చిన్న వ్యాపార సంస్థలకు మరిన్ని కొత్త అవకాశాలను అందించనున్నది. రిలయన్స్ జియోతో కలిసి కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నాం. ఈ ప్రాజెక్ట్‌ల కారణంగా భారత్‌లో చాలా మందికి వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. –మార్క్ జుకర్‌బర్గ్ అంబానీకి మహీంద్రా అభినందనలు ఫేస్‌బుక్‌తో డీల్ విషయంలో ముకేశ్ అంబానీకి అభినందనలు తెలియజేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర. ‘వైరస్‌పరమైన సంక్షోభ సమయంలో కుదిరిన ఈ ఒప్పందం .. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కి దక్కే ప్రాధాన్యం గురించి చాటిచెబుతోంది. వృద్ధికి నూతన కేంద్రంగా ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తుందన్న వార్తలకు బలం చేకూరుస్తోంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. -
టీడీపీలో బిగ్ డీల్స్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, ఎన్నికల సందర్భంగా టీడీపీలో పెద్ద డీల్స్ జరుగుతున్నాయి. సీటు ఆశిస్తున్న జూనియర్లను సీనియర్లు బుట్టలో వేసుకుంటున్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, యువనేత నారా లోకేష్‌ల వద్ద తమకు పలుకుబడి ఉందని నమ్మబలుకుతున్నారు. పార్టీకి రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, వచ్చేది మన ప్రభుత్వమేనంటూ వారిని ఊహాలోకాల్లో తేలుస్తున్నారు. రాజధానిలో ముఖ్యనేతలతో భేటీకి అపాయింట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు. ఒకరిద్దరు ముఖ్యనేతలైతే నా ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తే సీటు గ్యారంటీగా ఇప్పిస్తానంటున్నారు. ముఖ్యనేతల భేటీకి, రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేయడానికి ఇప్పటికే లక్షలు ఖర్చయ్యాయని కొందరు జూనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా డబ్బు ఉండి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు వీరి మాటల గారడీలో సులభంగా పడిపోతున్నారు. గుంటూరు తూర్పులో రెండు సామాజిక వర్గాల నేతలు సీటు మోజులో రాజధాని చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సౌదీలో ఇంజినీరుగా పనిచేసిన ఒక మైనార్టీ నేత, మరో సామాజికవర్గానికి చెందిన వ్యాపారి సీటు కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. సీటు ఇస్తే పార్టీకి ఫండ్ ఇస్తామని, ఎన్నికలకు ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నారు. రాజకీయాలతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా నేతల మాయలో పడి ఎన్టీఆర్ భవన్, ఇతర ముఖ్యనేతల నివాసాల వద్ద పడిగాపులు పడుతున్నారు. మైనార్టీనేతకు తెరవెనుక ఒక మాజీ మంత్రి ఉన్నారని, మరో సామాజికవర్గం నేతకు జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసిన ఒక నేతకు సత్తెనపల్లి సీటు ఇప్పిస్తానని జిల్లా పార్టీలో ముఖ్య భూమిక వహిస్తున్న నేత హామీ ఇచ్చారు. ఆ మేరకు అతని నుంచి సేవలు పొందారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సీటును మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా నేత మౌనందాల్చారు. మరో సీనియర్ నేత నిన్న మొన్నటివరకు తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఇక్కడ నీకు టిక్కెట్ ఇప్పిస్తానంటూ ఓ బీసీ నాయకునికి చెబుతూ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు అతనితో ఖర్చు పెట్టించారు. ఎన్నికలు దగ్గరపడగానే ప్రముఖ పారిశ్రామిక వేత్తలను పట్టుకుని వారికి టిక్కెట్ ఇప్పించేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. టిక్కెట్ ఇప్పిస్తే తనకు అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చును ఆయన భరించేలా మాట్లాడుకుని ఒక పారిశ్రామిక వేత్తను తెరపైకి తెచ్చారు. మరోవైపు పల్నాడు ప్రాంతంలోని ఒక నియోజకవర్గం టిక్కెట్ ఇప్పిస్తానంటూ బీసీ వర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి వద్ద భారీ మొత్తంలో డబ్బు మాట్లాడుకుని అధినేత వద్ద పావులు కదుపుతున్నట్టు పార్టీలో వినపడుతోంది. ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తితో జిల్లాకు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ వైద్యుని వద్ద సీనియర్లు డబ్బు గుంజినట్టు అధినేతకు ఫిర్యాదులు అందాయి. ఆ వైద్యునికి న్యాయం జరగకపోగా సీనియర్ నేతకు డబ్బు ఇచ్చిన పాపానికి టీడీపీ హైకమాండ్ ఆయనకు టిక్కెట్‌ను నిరాకరించింది. సీట్ల కేటాయింపు త్వరగా తేల్చాలని, లేకపోతే నేతల మాయలో పడి మరికొంత నష్టపోతామని కొత్తతరం నేతలంటున్నారు.