Indian Real Estate Big Deals In 2021: కరోనా సంక్షోభం చుట్టు ముట్టినా ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా తగ్గేదేలే అంటోంది హైదరాబాద్‌లో రియాల్టీ బూమ్. దేశంలో ఉన్న ఇతర ప్రధాన మెట్రో సిటీస్‌ని వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది దేశంలోనే అతి పెద్ద రియల్టీ డీల్‌కి హైదరాబాద్ వేదికగా మారింది.
రూ.235 కోట్లు
సింగిల్ బిట్ ప్లాట్‌కి సంబంధించి దేశంలోనే అతి పెద్ద రియల్టీ డీల్ ఇటీవల హైదరాబాద్‌లో ఖరారైంది. నగరానికి చెందిన అశోక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూకట్‌పల్లి సమీపంలో సింగిల్ బిట్‌గా ఉన్న పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు రికార్డు స్థాయిలో రూ. 235 కోట్లను వెచ్చించింది అశోక్ బిల్డర్స్. ఈ డీల్‌కి ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ సంధానకర్తగా వ్యవహరించింది.
మరో 250 కోట్లు
తాజాగా కొనుగోలు చేసిన స్థలంలో మిక్స్‌డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టు అశోక్ బిల్డర్స్ తెలిపారు. ఇందులో రెసిడెన్షియల్ జోన్‌తో పాటు గ్రేడ్ ఏ కమర్షియల స్పేస్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందు కోసం మరో రూ.250 కోట్లు వెచ్చించబోతున్నారు. ఈ ప్రాజెక్టును 2025 చివరికల్లా అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమన్నారు. అప్పటికల్లా ఈ ప్రాజెక్ట్ వ్యాల్యూ రూ.600 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది అశోక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్.
Comments
Please login to add a commentAdd a comment