jll realty firm
-
రూ.235 కోట్లతో అతి పెద్ద రియల్టీ డీల్ హైదరాబాద్‌లో..
Indian Real Estate Big Deals In 2021: కరోనా సంక్షోభం చుట్టు ముట్టినా ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా తగ్గేదేలే అంటోంది హైదరాబాద్‌లో రియాల్టీ బూమ్. దేశంలో ఉన్న ఇతర ప్రధాన మెట్రో సిటీస్‌ని వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది దేశంలోనే అతి పెద్ద రియల్టీ డీల్‌కి హైదరాబాద్ వేదికగా మారింది. రూ.235 కోట్లు సింగిల్ బిట్ ప్లాట్‌కి సంబంధించి దేశంలోనే అతి పెద్ద రియల్టీ డీల్ ఇటీవల హైదరాబాద్‌లో ఖరారైంది. నగరానికి చెందిన అశోక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూకట్పల్లి సమీపంలో సింగిల్ బిట్‌గా ఉన్న పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు రికార్డు స్థాయిలో రూ. 235 కోట్లను వెచ్చించింది అశోక్ బిల్డర్స్. ఈ డీల్‌కి ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ సంధానకర్తగా వ్యవహరించింది. మరో 250 కోట్లు తాజాగా కొనుగోలు చేసిన స్థలంలో మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టు అశోక్ బిల్డర్స్ తెలిపారు. ఇందులో రెసిడెన్షియల్ జోన్‌తో పాటు గ్రేడ్ ఏ కమర్షియల స్పేస్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందు కోసం మరో రూ.250 కోట్లు వెచ్చించబోతున్నారు. ఈ ప్రాజెక్టును 2025 చివరికల్లా అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమన్నారు. అప్పటికల్లా ఈ ప్రాజెక్ట్ వ్యాల్యూ రూ.600 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది అశోక్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. చదవండి:Container Homes: ఇళ్ల నిర్మాణంలో కొత్త ట్రెండ్ -
ఇండియాలో అత్యధిక రెంట్ వచ్చేది ఎక్కడో తెలుసా?
దేశ రాజధానిలో అత్యంత రద్ధీ ఉండే మార్కెట్ ఏరియాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్ మరో రికార్డు సృష్టించింది. ఇండియాలోనే ఆఫీస్ రెంట్/లీజు పరంగా అత్యధిక అద్దె లభించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తాజాగా ప్రకటించిన వివరాల్లో అత్యంత కాస్ట్లీ ఏరియా రికార్డులకెక్కింది. కన్నాట్‌ప్లేస్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 112 నగరాల్లోని 127 ఆఫీస్ మార్కెట్లకు సంబంధించి ప్రతీ ఏడు సర్వే చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా 2020కి సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించింది. ఇందులో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ ఏరియాలో చదరపు అడుగు స్థలానికి 109 డాలర్ల రెంట్ (రూ.8276)తో ఇండియాలోనే ప్రథమ స్థానంలో ప్రపంచ వ్యాప్తంగా 17వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో కన్నాట్‌ప్లేస్ 23వ స్థానంలో ఉండగా తాజాగా సవరించిన ధరలతో ఇక్కడ రెంట్ మరింత ప్రియంగా మారింది. కన్నాట్‌ప్లేస్‌లో ఆఫీస్ వర్క్‌ప్లేస్ డిమాండ్ అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన శాన్ఫ్రాన్సిస్కో కంటే ఖరీదైంది కావడం గమనార్హం. రెండో స్థానంలో ముంబై బాంద్రా న్యూఢిల్లీ తర్వాత ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఏరియా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు ఆఫీస్ స్పేస్ రెంట్ 102 డాలర్లుగా ఉంది. ఆ తర్వాత స్థానంలో ముంబైలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియా 58 డాలర్లు, బెంగళూరులో 51 డాలర్లు, గురుగ్రామ్ 48 డాలర్లు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ సగటు 44 డాలర్లుగా జేఎల్ఎల్ పేర్కొంది. ఇక అత్యంత చవకగా ఆఫీస్ స్పేస్ రెంట్‌కి లభించే నగరంగా చెన్నై నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం రెంట్ ఏడాదికి కేవలం 21 డాలర్లుగా ఉంది. ఫస్ట్‌ప్లేస్‌లో న్యూయార్క్ న్యూయార్క్ మిడ్‌టౌన్, హాంగ్‌కాంగ్ సెంట్రల్ ఏరియాలో ఆఫీస్ రెంట్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ చదరపు అడుగు స్థలానికి అద్దెగా ఏకంగా 261 డాలర్లు చెల్లించాల్సిందే. ఆ తర్వాతి స్థానంలో బీజింగ్‌లో ఫినాన్స్ స్ట్రీట్, లండన్ వెస్ట్ఎండ్, యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ నగరాలు ఉన్నాయి. చదవండి:హైదరాబాద్ తర్వాతే ముంబై, బెంగళూరు నగరాలు -
కుక్కలను బంధించారని.. ఉద్యోగాలు పీకేశారు!
కుక్కలను బంధించి, చిత్రహింసలు పెట్టి బలవంతంగా అవి ఉన్నచోటు నుంచి వేరే చోట వదిలేసినందుకు ఇద్దరి ఉద్యోగాలు ఊడిపోయాయి. జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్ఎల్) అనే కార్పొరేట్ రియాల్టీ సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జంతు హక్కుల కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకుంది. పీపుల్స్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) అనే సంస్థకు చెందిన నిరాలి కొరాడియా అనే మహిళ ఈ విషయాన్ని గుర్తించారు. జేఎల్ఎల్ నిర్వహణలో ఉన్న ఒక వాణిజ్య ప్రాంగణంలో ఉండాల్సిన కొన్ని కుక్కలు కనిపించడం లేదని ఆయేషా లో బో అనే మహిళ ఫిర్యాదు చేశారని, ఆమె జంతువులకు ఆహారం ఇస్తుంటారని తెలిపారు. ఆ సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులే వాటిని బంధించి, చిత్రహింసలు పెట్టి వాటిని వేరే చోటుకు తీసుకెళ్లి వదిలేసినట్లు తేలింది. దాంతో సంస్థ ఉద్యోగులు జూలియస్, జీకే జగతప్, కె. క్రునాల్ అనే ఇద్దరిపై తాము 15 రోజుల క్రితం అంధేరి పోలీసులకు ఫిర్యాదు చేశామని కొరాడియా చెప్పారు. ఈ విషయం గురించి జేఎల్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా చెప్పామన్నారు. వెంటనే స్పందించిన సదరు కంపెనీ.. జూలియస్, జగతప్ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించిందని, క్రునాల్ నేరుగా బాధ్యుడు కాడు కాబట్టి అతడిని వదిలిపెట్టారని అన్నారు. జంతువులను హింసించి లేదా హతమార్చినా ఏమీ కాదనుకునేవారికి ఇది గుణపాఠమని కొరాడియా తెలిపారు. వాళ్లు చిత్రహింసలు పెట్టిన కుక్కలు రెండూ చాలా ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు కూడా అయిపోయి, రేబిస్ వాక్సిన్లు కూడా వేశారని చెప్పారు. అవి మరీ అరిచేవి కూడా కాదని.. అయినా చదువుకున్న వాళ్లు కూడా ఇలా జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడం సరికాదని తెలిపారు.