సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) కు చెందిన రిలయన్స్ జియో మరో భారీ డీల్ సాదించింది. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ 750 మిలియన్ డాలర్లకు (రూ. 5,655 కోట్ల) 1.15 శాతం జియో వాటాలను కొనుగోలు చేసింది. 9.99 శాతం వాటా కొనుగోలుతో ఫేస్‌బుక్ 5.7 బిలియన్ డాలర్ల మెగా డీల్ చేసుకున్న వారం రోజుల తరువాత జియో మరో మెగా డీల్ సాధించడం విశేషం. దీనిపై ఇరు సంస్థలు సంతోషాన్ని వ్యక్తం చేసాయి. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర సంబంధిత చట్ట అనుమతులను పొందాల్సి వుంది. (ఫేస్‌బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)
ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా రికార్డున్న సిల్వర్ లేక్ భాగస్వామ్యం సంతోషాన్ని స్తోందన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామమని పేర్కొన్నారు.మరోవైపు అత్యంతముఖ్యమైన సంస్థలలో ఒకటిగా జియోను అభివర్ణించిన సిల్వర్ లేక్ కో సీఈఓ ఎగాన్ డర్బన్ చాలా బలమైన, వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో నడుస్తున్న సంస్థతో భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. (లాక్‌డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్)
ఫేస్‌బుక్ పెట్టుబడితో పాటు, ఆర్ఐఎల్ ఇతర వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారుల భారీ ఆసక్తి నెలకొందని, రాబోయే నెలల్లో ఇదే తరహా పెట్టుబడిని సాధించనున్నామని ఏప్రిల్ 30న త్రైమాసిక, వార్షికఫలితాల సందర్బంగా రిలయన్స్ ప్రకటించింది. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ) (జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్)
Comments
Please login to add a commentAdd a comment