
సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌కు సంబంధించి కొత్త డేట్స్‌ను ప్రకటించింది. తొలి దశ ఆఫర్లు అక్టోబర్ 16తో ముగియడంతో వినియోగ దారుల కోసం తాజా తేదీలను వెల్లడించింది. తద్వారా తన కస్టమర్లలో దివాలీ జోష్ నింపింది.
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 19న తిరిగి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. తాజా సెకండ్ సేల్‌లో కూడా వివిధ స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తదితరాలపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ అక్టోబర్ 18 అర్ధరాత్రి సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతోపాటు, ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇంకా పేటీఎం వాలెట్, యూపీఐ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్, రియల్‌మీ, పోకో, ఒప్పో, వివో, షావోమీ, మోటరోలా, గూగుల్, ఇన్ఫినిక్స్, మైక్రోమ్యాక్స్, లావా వంటిపై తగ్గింపు లభ్యం. ఇంకా గేమింగ్ ల్యాప్‌టాప్‌లు , పెన్ డ్రైవ్‌లు మరియు హార్డ్ డ్రైవ్‌లు వంటి డేటా స్టోరేజ్ పరికరాలపై కూడా తగ్గింపును పొందవచ్చు.
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్లు, కేసులు, స్క్రీన్ గార్డ్‌లు వంటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 4K అల్ట్రా HD స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు సహా,టీవీలు, ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment