Flipkart Big Diwali Sale Starts October 17 - Sakshi
Sakshi News home page

Flipkart Big Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్‌ దివాళీ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!

Published Wed, Oct 13 2021 2:13 PM | Last Updated on Wed, Oct 13 2021 3:36 PM

up to 80 percent discount in Flipkart Big Diwali Sale starts October 17  - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ కొనుగోలు దారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌ సందర్భంగా ఫ్లిప్‌ కార్ట్‌ కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు అందించగా.. తాజాగా మరో సారి డిస్కౌంట్లు ఇస్తుండడంతో వినియోగదారులు వారికి నచ్చిన బ్రాండ్‌లను కొనుగోలు చేసుందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  

బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌
దసరా ఫెస్టివల్‌ సందర్భంగా ఫ్లిప్‌ కార్ట్‌ అక్టోబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 10 వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ను నిర్వహించింది. తాజాగా దివాళీ సందర్భంగా అక్టోబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 23 వరకు 'బిగ్‌ దివాళీ సేల్‌' ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో ప్రీమియం (ప్లస్‌) మెంబర్స్‌కు అక్టోబర్‌ 16న మధ్యహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై ప్రొడక్ట్‌లను కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ లభించనుంది. 

ఈ ప్రొడక్ట్‌లపై 80 డిస్కౌంట్‌
అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్స్‌పై ఫ్లిప్‌ కార్ట్‌ 80శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.అదనంగా ఎలక్ట్రానిక్స్‌, యాక్స్‌సరీస్‌, టీవీ, అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు.

చదవండి: మార్కెట్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌, ఫీచర్లు మాత్రం అదుర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement