అమెజాన్ 'ద బ్యూటీ సేల్' - 60 శాతం డిస్కౌంట్స్.. కేవలం మూడు రోజులు మాత్రమే! | Amazon The Beauty Sale Dates And Details | Sakshi

అమెజాన్ 'ద బ్యూటీ సేల్' - 60 శాతం డిస్కౌంట్స్.. కేవలం మూడు రోజులు మాత్రమే!

Nov 23 2023 12:18 PM | Updated on Nov 23 2023 12:27 PM

Amazon The Beauty Sale Dates And Details - Sakshi

ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యూటీ షాపింగ్ మొదలపోతోంది. నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ అమెజాన్ బ్యూటీ సేల్ 26 వరకు ఉంటుంది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద 50 నుంచి 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కే-బ్యూటీ నుంచి బార్బీకోర్ లుక్స్ వరకు ట్రెండింగ్  జెన్ జడ్ ప్రాధాన్యత గల ఉత్పత్తులు, బ్యూటీ బ్రాండ్‌ల వంటి ఉత్పత్తులు, సౌందర్య పరికరాల నుండి ఎంచుకోవచ్చు.

అసలే శీతాకాలం పైగా వివాహాల సీజన్.. కొందరు చర్మ రక్షణ కోసం మరి కొందరు ఫంక్షన్స్‌లో ప్రత్యేకంగా కనిపించడం కోసం అనేక సౌదర్య ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి అమెజాన్ ద బ్యూటీ సేల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కస్టమర్స్ ప్రతి లగ్జరీ బ్యూటీ కొనుగోలుతో మీద మంచి డీల్స్, ఫ్రీ గిఫ్ట్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. బై మోర్, సేవ్ ఆఫర్స్ కింద కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8 PM డీల్స్,  సబ్‌స్క్రైబ్ అండ్ సేవ్‌తో 10% వరకు ఆదా చేసుకోవచ్చు. కస్టమర్ షాపింగ్, ఉత్పత్తి వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడం నుంచి ఉత్పత్తి అనుకూలత వంటి వాటికి కంపెనీ అందిస్తుంది.

మేబిలైన్, లోరియల్ ప్రొఫెషనల్, బయోటిక్, కామా ఆయుర్వేద, స్విస్ బ్యూటీ, లాక్మే, రినీ కాస్మెటిక్స్, మైగ్లామ్, కలర్ బార్ కాస్మటిక్స్, పౌలాస్ ఛాయిస్.. ఇంకా ఎన్నో 300 కంటే ఎక్కువ బ్రాండ్స్‌పై ఉత్తేజభరితమైన 8000 కంటే ఎక్కువ డీల్స్ పొందవచ్చు.

అమెజాన్ ద బ్యూటీ సేల్ సందర్భంగా.. అమెజాన్ ఇండియా, బ్యూటీ, పర్సనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ 'జెబా ఖాన్' మాట్లాడుతూ.. ఇప్పటికే ది బ్యూటీ సేల్ మొదటి రెండు ఎడిషన్లకు కస్టమర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మూడవ ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. చర్మ సంరక్షణ, మేకప్ వంటి లగ్జరీ ఉత్పత్తులతో అందాన్ని మరింత పెంచుకోవడంలో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. అందం మీద ద్రుష్టి పెట్టే ప్రతి ఒకరికి ఇది సరైన చోటు అని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement