
లైసెన్స్‌ల జారీ విధానంలో రవాణాశాఖ సమూల మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటి వల్ల సులువుగా డ్రైవింగ్ లైసెన్సులు పొందవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ విశేషాలు.. వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
తొండంగి (తుని): ద్విచక్రవాహనాలకు మోటార్స్ సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్ రెండు రకాల లైసెన్స్‌లు ఉండేవి. ఆటోలు నడిపేందుకు త్రీవీలర్ లైసెన్స్‌తోపాటు బ్యాడ్జి ఉండాలి. ట్రాన్స్‌పోర్టు ప్యాసింజర్ వెహికల్స్, గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, ట్రాన్స్‌పోర్టు వెహికల్ నడిపేందుకు విడివిడిగా లైసెన్స్‌లు మంజూరు చేసేవారు. దీంతోపాటు ప్యాసింజర్, హెవీ గూడ్స్ వెహికల్ నడిపాలంటే బ్యాడ్జిని పొందాల్సి ఉంది. మూడేళ్ల అనుభవం ఉన్న వారికి బ్యాడ్జి మంజూరు చేసేవారు.
లైట్ మోటార్ వెహికల్ నాన్‌ట్రాన్స్‌పోర్టు ఉంటే సొంత కారు, లైట్‌మోటార్ వెహికల్(ట్రాన్స్‌పోర్టు) ఉంటే నాలుగు చక్రాల కమర్షియల్ పాసింజర్ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు జారీచేసే వారు. వాహనాలు నడిపేందుకు లైసెన్స్ జారీ విధానంలో పలు నిబంధనలతో కూడిన పలు రకాలు లైసెన్సు రవాణాశాఖ జారీ చేసేది. వీటిని పొందేందుకు వాహన యజమానులు, డ్రైవర్లు గతంలో పుట్టిన తేదీ కోసం పాఠశాలలో చదివిన ధ్రువీకరణపత్రం, ఎల్‌ఐసీ బాండ్ పేపర్ వంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇవి లేక వాహనాల డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు కాక తనిఖీ సమయంలో అపరాధ రుసుములు కట్టాల్సిన పరిస్ధితి ఉంది. దీంతో వాహనదారులు వాహనాన్ని నడిపే అనుభవం ఎంత ఉన్నా లైసెన్సులేక రహదారులపై తనిఖీల సమయంలో అధికారులకు పట్టుబడి ఇబ్బందులుపడుతున్నారు.
పాత నిబంధనలతో బీమావర్తింపునకు ఆటంకం
ప్రస్తుతం ఇప్పటి వరకూ డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అమలు చేసిన నిబంధనలు బీమా వర్తింపునకు ఆటంకంగా మారేవి. రోడ్డుపై ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వాహనానికి చేయించిన బీమా వర్తించాలంటే కచ్చితంగా ప్రమాదం జరిగిన సందర్భంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తికి లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. అదే సందర్భంలో నిబంధనల ప్రకారం వాహన రకాన్ని బట్టి ఆయా కేటగిరీకి చెందిన లైసెన్సు నిబంధనల ప్రకారం పొంది ఉన్నాడా? లేదా? అన్న విషయంపై బీమా సంస్థలు విచారణ చేసేవి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే బీమా క్లెయిమ్‌ను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలు, నిబంధనల మార్పు బీమా వర్తింపునకు సులభతరం కానుంది.
నూతన విధానం ఇలా..
వాహనాలను నడిపేందుకు లైసెన్స్ మంజూరులో నిబంధనలు పూర్తిగా మార్పు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాయని కత్తిపూడి రవాణాశాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మోటార్‌సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్, లైట్‌మోటార్ వెహికల్, ట్రాన్స్‌పోర్టు వెహికల్ నాలుగు విధానాల్లో మంజూరు చేసే విధంగా నిబంధనలు మార్పు చేశారు.
1. మోటార్ సైకిల్ వితౌట్ గేర్
2.మోటార్ సైకిల్ విత్ గేర్
3. లైట్ మోటార్ వెహికల్ ( ఈలైసెన్స్‌తో 7500 కిలోలు జీవీడబ్ల్యూ (గ్రాస్ వెహికల్ వెయిట్) వాహనం బరువు లోపు అన్ని త్రిచక్ర(ఆటోలు, గూడ్స్ ఆటోలు) నాలుగు చక్రాల వాహనాలు(కార్లు, సొంతవి, అద్దెవి, ట్రాన్స్‌పోర్టు, నాన్‌ట్రాన్స్‌పోర్టు, పాసింజర్, కమర్షియల్ టాటా మేజిక్ వంటి వాహనాలు) నడపవచ్చు. పైమూడు లైసెన్స్‌లు పొందేందుకు ఆధార్‌కార్డు ఉంటే చాలు. ఎటువంటి ధృవపత్రాలు అవసరంలేదు. (యాభై ఏళ్లు పైబడితే మెడికల్ సర్టిఫికెట్ ఇవాల్సి ఉంది.
4. ట్రాన్స్‌పోర్టు వెహికల్ లైసెన్స్: 7500 జీవీడబ్ల్యూ పైన ఉన్న పాసింజర్, గూడ్స్ వాహనాలన్నీ నడపవచ్చు. (లైసెన్స్ పొందేందుకు ఎనిమిదో తరగతి విద్యార్హత పొంది ఉండాలి).
Comments
Please login to add a commentAdd a comment