
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఆధార్‌ను ధ్రువీకరణకు వాడటాన్ని నిలిపివేశామని ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేముందు ధ్రువీకరణకు ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభకు తెలిపారు. 2018 సెప్టెంబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాము ఈ చర్య తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఆధారంగా 1.57 కోట్ల డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేశామనీ, అలాగే 1.65 కోట్ల వాహనాలను రిజిస్టర్ చేశామనీ, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఆధార్‌ను ధ్రువీకరణకు వాడటాన్ని నిలిపివేశామని ఆయన వెల్లడించారు. (చదవండి: డ్రైవింగ్ లైసెన్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం)