శభాష్‌.. తాన్సేన్‌ | - | Sakshi
Sakshi News home page

శభాష్‌.. తాన్సేన్‌

Published Mon, May 6 2024 8:35 AM | Last Updated on Mon, May 6 2024 4:20 PM

శభాష్

శభాష్‌.. తాన్సేన్‌

● రెండు చేతులు లేని దివ్యాంగుడికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ● రాష్ట్రంలోనే తొలిసారి..
నేడు ప్లస్‌–2 ఫలితాల విడుదల

కొరుక్కుపేట: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. రెండు చేతుల లేని ఓ వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పొందాడు. రాష్ట్రంలో కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి దివ్యాంగుడిగా చైన్నెకి చెందిన తాన్సేన్‌ గుర్తింపు పొందాడు. 31 ఏళ్ల తాన్సేన్‌ చైన్నెలోని వ్యాసార్పాడి పెరియార్‌నగర్‌కు చెందినవాడు. ఇతనికి 10 సంవత్సరాల వయస్సులో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ పంప్‌లో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో ఇతని చేతులను మోచేయి కిందికి తీసేయాల్సి వచ్చింది. దీంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చేతులు లేకపోవడం మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా ఏ సహాయం లేకుండా తన దైనందిన పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకున్నాడు.

కాళ్లతోనే..

ఆ తర్వాత కాళ్లతో రాయడం, ఈత కొట్టడం, డ్రమ్స్‌ వాయించడం నేర్చుకున్నాడు. తన పాఠశాల విద్యను పూర్తి చేసి, ఇంజినీరింగ్‌ చదివిన తర్వాత, అతను న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం అంబేడ్కర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీని అభ్యసిస్తున్నాడు. అతనికి వివాహమై ఏడాదిన్నర కుమార్తె ఉంది. బయటకు వెళ్లటం కష్టంగా మారుతుండడంతో కారు నడపాలనుకున్నాడు. అనుకుందే తడువుగా స్నేహితుల సహకారంతో కాళ్లతోనే డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. అయితే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం, చైన్నె కె.కె. నగర్‌లోని రిహాబిలిటేషన్‌ ఆసుపత్రికి వెళ్లగా కారు డిజైన్‌కు ఆయనకు అనువుగా మార్చాలని తెలిపారు. ఆసుపత్రి ఫిజియోలాజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ గునార్‌ తిరునావుక్కరసు, వైద్యులు మార్గనిర్దేశం చేశారు.

సాక్షి, చైన్నె: ప్లస్‌–2 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. వివరాలు.. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 7,534 ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మార్చి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పబ్లిక్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 7.72 లక్షల మంది రెగ్యులర్‌, 21,875 మంది ప్రైవేటు, 125 మంది ఖైదీలు పరీక్షలు రాశారు. గ్రేటర్‌ చైన్నె పరిధిలోని 405 పాఠశాలల నుంచి 45 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎన్నికల సీజన్‌ కావడంతో సకాలంలో వాల్యుయేషన్‌ ప్రక్రియను ముగించి, ముందుగా నిర్ణయించిన మేరకు ఫలితాలను విడుదల చేయడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 40 వేల మంది ఉపాధ్యాయులు సకాలంలో మూల్యాంకనాన్ని ముగించారు. మార్కుల జాబితాను గత వారం రోజు లుగా అధికారులు సిద్దం చేస్తూ వచ్చారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఫలితాల విడుదలకు సిద్ధమయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ఎన్నికల యంత్రాంగం అనుమతితో సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ ఫలితాలను విడుద ల చేయాడానికి సిద్ధమయ్యారు. ఉదయం 9.30 గంటలకు చైన్నెలో ఫలితాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు రిజిస్టడ్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్లకు తక్షణం ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఉత్తీర్ణత శాతం వివరాలను తెలియజేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా పాఠశాలలోని నోటీసు బోర్డులలో ఫలితాలను ప్రకటించనున్నారు. అంతే కాకుండా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. డీజీఈ.టీఎన్‌.జీఓవీ.ఇన్‌, డీజీఈ1.టీఎన్‌.జీఓవీ వెబ్‌సైట్‌ల ద్వారా మార్కుల జాబితాను అందుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే 10వ తేదీన ముందుగా నిర్ణయించిన మేరకు పదో తరగతి ఫలితాలనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు.

ఎట్టకేలకూ..

అన్ని నిబంధనలను పూర్తి చేసి రెట్టేరి ఆర్టీఓ కార్యాలయంలో తాన్సేన్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాడు. కేకే నగర్‌లోని గవర్నమెంట్‌ ఇనన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ మెడిసిన్‌ వైద్యులు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిన తర్వాత చైన్నె నార్త్‌ ఆర్‌టీఓ కార్యాలయం తాన్సేన్‌కు మోడిఫైడ్‌ కారును నడపడానికి 10 సంవత్సరాల లైసెన్స్‌ను జారీ చేసింది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తమిళనాడులోనే మొదటి దివ్యాంగుడిగా తాన్సేన్‌ గుర్తింపు పొందాడు. రెండు చేతులు లేకుండా లైసెన్స్‌ పొందిన దేశంలో మూడవ వ్యక్తి కూడా ఆయనే. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 22న డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
శభాష్‌.. తాన్సేన్‌1
1/5

శభాష్‌.. తాన్సేన్‌

శభాష్‌.. తాన్సేన్‌2
2/5

శభాష్‌.. తాన్సేన్‌

శభాష్‌.. తాన్సేన్‌3
3/5

శభాష్‌.. తాన్సేన్‌

శభాష్‌.. తాన్సేన్‌4
4/5

శభాష్‌.. తాన్సేన్‌

శభాష్‌.. తాన్సేన్‌5
5/5

శభాష్‌.. తాన్సేన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement