హెల్మెట్ లేని 4442 మందిపై కేసులు
హిమాయత్‌నగర్ : హెల్మెట్ లేకుండా వాహానాలు నడుతుపుతున్న వారిని పోలీసులు గుర్తించి జరిమానాలు విధించారు. నారాయణగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ నారాయణగడూ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టగా హెల్మెట్ లేకుండా డ్రై వింగ్ చేస్తున్న వారు మొత్తం 4442మందిని గుర్తించామన్నారు.
వీరిందరికి జరిమానాను విధించినట్లు చెప్పారు. వీరితో పాటు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహానాలు నడుపుతున్న 621మందిని గుర్తించి జరిమానా విధించామన్నారు. రెండవ సారి కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ దొరికితే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామన్నారు.