అనంతపురం సెంట్రల్: వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్‌లైన్ విధానంలో సులభంగా పొందవచ్చని ఉప రవాణా కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థి సాయి శరత్‌కు బుధవారం ఆయన తన కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానం వల్ల కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను పారదర్శకంగా అందించడమే ఆన్‌లైన్ ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, కానిస్టేబుళ్లు చలపతి, వలి తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్
Published Thu, Nov 9 2017 6:57 AM | Last Updated on Thu, Nov 9 2017 6:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment