డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, ఓటర్ ఐడీ, పాన్, ఆధార్, విద్యా సర్టిఫికెట్లు...ఇలా ఏ గుర్తింపు కార్డు లేదా ధ్రువీకరణ పత్రానికైనా సరే మీరు ఇక ఎంచక్కా డిజిటల్ రూపం ఇవ్వొచ్చు. మీ సెల్‌ఫోన్‌లోనే అన్నింటినీ ఒకేచోట ఈృకాపీల రూపంలో భద్రపరుచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక్క క్లిక్‌తో వాటిని తీసి అడిగిన వారికి చూపించొచ్చు. ‘డిజిటల్ ఇండియా’లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన డిజిలాకర్ యాప్‌తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. ఈ అప్లికేషన్ వెబ్‌సైట్‌లతోపాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ లాకర్‌లో భద్రపరుచుకోవడమే ‘డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, మీసెల్‌ఫోన్ నంబర్లకు దీనిని లింక్‌చేస్తారు.
ఒక్కోవినియోగదారుడు 1 జీబీ డేటావరకు క్లౌడ్ పద్ధతిలో లో భద్రపరుచుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్‌జీ ఫార్మాట్‌లో స్కాన్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఈృసంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్లుఅవుతుంది.అదే విధంగా సీబీఎస్‌ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్నుశాఖలు జారీచేసే డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలనూ నేరుగా మీ డిజిలాకర్‌ఖాతాలోకి పంపొచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థతోపాటు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ, సీబీఎస్‌ఈ సహా వివిధ స్కూలు బోర్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్‌ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కులషీట్లు, కుల, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం డిజిలాకర్‌నువాడుతున్నారు.
ఉపయోగించడం ఇలా..
- డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్‌వర్డ్ కోసం ఆధార్, మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి.
- ఏదైనా సంస్థ మీ ఈృడాక్యుమెంట్లను అందులో అప్‌లోడ్ చేసినా మీ అకౌంట్‌లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్‌లోడ్ చేయడంతోపాటు వాటిపై సంతకం చేయొచ్చు.
- ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందొచ్చు. ఇందుకోసం ఈృడాక్యుమెంట్‌లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment