ఈ-రిక్షాలపై కేంద్రం నోటిఫికేషన్ | Govt issues notification for plying of e-rickshaws | Sakshi
Sakshi News home page

ఈ-రిక్షాలపై కేంద్రం నోటిఫికేషన్

Published Sat, Oct 11 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

ఈ-రిక్షాలపై కేంద్రం నోటిఫికేషన్

ఈ-రిక్షాలపై కేంద్రం నోటిఫికేషన్

డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి : గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ
న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై కేంద్ర  ప్రభుత్వం నిబంధనలతో కూడిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరిగా ఉండాలని గరిష్ట వేగపరిమితి గంటకు 25 కిలోమీటర్లకు మించకూడదని అందులో పేర్కొంది. కేంద్ర మోటారు వాహనాల చట్టం (16వ సవరణ) నిబంధనలు-14... ఈ బ్యాటరీ ఆధారిత ప్రత్యేక వాహనాలను నగరంలో నడుపుకునేందుకు అనుమతినిచ్చింది.

ఈ వాహనాల్లో కేవలం నగురు ప్రయాణికులనే ఎక్కించుకోవాల్సి ఉంటుంది.ఇక లగేజీ 40 కిలోల కు మించరాదు. ఈ వాహనం మోటారు సామర్థ్యం రెండు వేల వాట్లకు మించకూడదు. ప్రయాణికులకు దాదాపు ఇంటి దగ్గరదాకా చేరవేసేందుకు ఉద్దేశించిన ఈ వాహనాలు నగర రహదారులపై సంచరించేందుకు సవరించిన నిబంధనలను అనుమతిస్తున్నాయి.
 
కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషే ధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. నియంత్రణకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగర రహదారులపై ఈ-రిక్షాలను అనుమతించాలా లేక మోటారు వాహనాల చట్టం కింద కచ్చితంగా వాటిపై ఆంక్షలు విధిం చాలా అనే విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
 
సామగ్రి చేరవేతకే అనుమతి
ఇక ఈ-కార్ట్‌లను సామగ్రి చేరవేతకే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ-కార్ట్‌లలో లోడు చేసిన సామగ్రి బరువు డ్రైవర్‌తో కలుపుకుని 310 కిలోలకు మించకూడదు. ఈ-రిక్షాలతోపాటు ఈ కార్ట్‌ల యజమానులు కూడా ఎట్టిపరిస్థితుల్లో నూ డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement