E-Rickshaws
-
ఈ-రిక్షాలకు మార్గం సుగమం..
సాక్షి, న్యూఢిల్లీ: ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తెచ్చి వాటిని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. మోటారు వాహన చట్టం ( సవరణ ) బిల్లు- 2014 ఈ రిక్షాలు, ఈ కార్టులకు చట్టబద్ధత కల్పించడంతో పాటు వాటి చోదకులకు డ్రైవింగ్‌లెసైన్స్ నియమాలను సడలించేందుకు వీలు కల్పించింది. ఈ రిక్షాలను వాటి యజమానులే నడపాలని, అద్దెకు ఇవ్వరాదని కూడా బిల్లు పేర్కొంది. ఈ సవరణ బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ రిక్షాలు, ఈ కార్టుల ప్రమాణాలకు సంబంధించిన నియమాలను రూపొందించడంతో పాటు వాటి చోదకులకు డ్రైవింగ్ లెసైన్సులు ఇచ్చే తీరును, షరతులను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. ఈ మోటారు వాహన చట్టం -1988 ను సవరిస్తూ మోటారు వాహన చట్టం సవరణ -2104 పేరుతో రవాణా మంత్రిత్వశాఖ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఈ రిక్షా యజమానులు ఈ రిక్షా మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ వద్ద పది రోజులు శిక్షణ తీసుకుని వాటిని నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం డ్రైవర్లు కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలన్న నియమాన్ని కూడా సవరించారు. డ్రైవరు కాకుండా నలుగురుకు మించి వ్యక్తులు ఈ రిక్షాలో ప్రయాణించరాదని బిల్లు పేర్కొంది. ఈ రిక్షాలో 40 కిలోలు, ఈ కార్టులో 310 కిలోలకు మించిన బరువు సామాను తీసుకువెళ్లరాదని, వాటి వేగం గంటకు 25 కిమీలకు మించరాదని కూడా బిల్లు పేర్కొంది. ఈ బిల్లుపై సభలో జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ ఈ చట్టం రూపొందడం వల్ల పర్యావరణానికి మేలు కలగడంతో పాటు పేదలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశంలో దాదాపు కోటి మంది ఈ రిక్షా, ఈ కార్టు చోదకులు ఉన్నారని ఆయన చెప్పారు. రిక్షాచోదకులకు శారీరక శ్రమ నుంచి వముక్తి కలిగించి వారు ఈ రిక్షాలు, ఈ కార్టు నడిపేలా చేయాలని ఆయన చెప్పారు. స్టాండింగ్ కమిటీ ముందుంచిన తర్వాత బిల్లును పార్లమెంటు ఆమోదం కోసం సమర్పిస్తే బాగుండేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. తాము పేదలకు వ్యతిరేకం కాదని కాదని, కానీ బీజేపీ సర్కారు సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో చాలా బిల్లులను స్టాండింగ్ కమిటీకి సమర్పించ లేదని, ఢిల్లీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రభుత్వం ఈ రిక్షా బిల్లును తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, చర్చలో కాంగ్రెస్‌కు చెందిన రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. ఈ రిక్షాల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో నడవనిస్తారా అని ప్రశ్నించారు. అప్నాదళ్‌కు చెందిన అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. ఈ రిక్షాలు పర్యావరణానికి సన్నిహితమైనవి, పేదలకు అనువైనవని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రిక్షా బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రతిపక్షం చేసిన ఆరోపణలను మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు.ప్రభుత్వం ఇదివరకే మార్గదర్శకాలను రూపొందించిందని, కానీ ఈ రిక్షాలను మోటారు వాహన చట్టం కిందకు తేవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడం వల్ల బిల్లు తేవాల్సివచ్చిందని ఆయన చెప్పారు. -
నిషేధాలు ఉల్లంఘిస్తున్న ఈ రిక్షాలు
న్యూఢిల్లీ: నగరంలో ఈ రిక్షాలు నడుస్తున్నా ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌పోర్టు విభాగం అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు మంగళవారం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నగరంలో ఈ రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ నగరంలో ఈ రిక్షాలు నడుస్తున్నా పై రెండు విభాగాలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగా కోర్టు ధిక్కార చర్యలు ఎందు తీసుకోకూడదని ఆయా విభాగాలను ప్రశ్నించింది. ఈ రిక్షాల సైజులో సాంకేతికలోపంతోపాటు, వాటి టైర్లు ఉబ్బి ఉన్నాయని, ఇవి నగర రోడ్లపై తిరగడం సరైందకాదని ఆయా విభాగాలకు సూచిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన హైకోర్టు నిషేధం విధించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) అనిల్‌కుమార్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సతీష్ మాధుర్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 18వ తేదీలోగా సమర్పించాలని జస్టిస్ వీకే షాలీ చెప్పారు. ఈ రిక్షాలు వివిధ తేదీల్లో నగరంలో తిరిగినట్లు ఆధారాలు చూపే దృశ్య చిత్రాలను పిటిషనర్ షహనావాజ్ ఖాన్ కోర్టు సమర్పించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పోలీసులు ఈ రిక్షాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. చాందీచౌక్ ప్రాంతంలో ఈ రిక్షాలు తిరిగినట్లు కోర్టు పరిశీలనలో కూడా వెల్లడైందన్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీమ్సేన్ బాసీతోపాటు ప్రతివాదుల తరఫున న్యాయవాది జుబేదా బేగం వాదించారు. ట్రాన్స్‌పోర్టు విభాగం అక్టోబర్ 8వ తేదీన నగరంలో ఈ రిక్షాలు నడవడానికి అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ రిక్షాలకు వ్యతిరేకంగా వచ్చిన అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. తదుపరి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు కోర్టుకు సూచించారు. న్యాయవాది సుగ్రీవ్ దుబే ద్వారా పిటిషనర్ షహనావాజ్ వేసిన కోర్టు ధిక్కార ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోర్టు సెప్టెంబర్ 9వ తేదీన నగరంలో ఈ రిక్షాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ రిక్షాలు నగరంలో కొనసాగుతున్నాయి. దీనిపై నిర్ణీత గడువులోగా కోర్టుకు సమాధానం చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. -
ఈ-రిక్షాలపై కేంద్రం నోటిఫికేషన్
డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి : గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో కూడిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరిగా ఉండాలని గరిష్ట వేగపరిమితి గంటకు 25 కిలోమీటర్లకు మించకూడదని అందులో పేర్కొంది. కేంద్ర మోటారు వాహనాల చట్టం (16వ సవరణ) నిబంధనలు-14... ఈ బ్యాటరీ ఆధారిత ప్రత్యేక వాహనాలను నగరంలో నడుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ వాహనాల్లో కేవలం నగురు ప్రయాణికులనే ఎక్కించుకోవాల్సి ఉంటుంది.ఇక లగేజీ 40 కిలోల కు మించరాదు. ఈ వాహనం మోటారు సామర్థ్యం రెండు వేల వాట్లకు మించకూడదు. ప్రయాణికులకు దాదాపు ఇంటి దగ్గరదాకా చేరవేసేందుకు ఉద్దేశించిన ఈ వాహనాలు నగర రహదారులపై సంచరించేందుకు సవరించిన నిబంధనలను అనుమతిస్తున్నాయి. కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషే ధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. నియంత్రణకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగర రహదారులపై ఈ-రిక్షాలను అనుమతించాలా లేక మోటారు వాహనాల చట్టం కింద కచ్చితంగా వాటిపై ఆంక్షలు విధిం చాలా అనే విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది. సామగ్రి చేరవేతకే అనుమతి ఇక ఈ-కార్ట్‌లను సామగ్రి చేరవేతకే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ-కార్ట్‌లలో లోడు చేసిన సామగ్రి బరువు డ్రైవర్‌తో కలుపుకుని 310 కిలోలకు మించకూడదు. ఈ-రిక్షాలతోపాటు ఈ కార్ట్‌ల యజమానులు కూడా ఎట్టిపరిస్థితుల్లో నూ డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరి. -
ఈ-రిక్షాలపై వచ్చేవారం తుది నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఈ-రిక్షాలకు సంబంధించి నూతన నియమనిబంధనలతోకూడిన తుది నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం విడుదల చేయనుంది. ఇందులో గరిష్ట వేగపరిమితి గంటకు 25 కి.మీ: డ్రైవింగ్ లెసైన్సు తప్పనిసరివంటి నిబంధనలను పొందుపరచనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. న్యూ సెంట్రల్ వెహికల్ రూల్స్-2014 పేరిట దీనిని విడుదల చేస్తుందన్నారు. దసరా సెలవుల తర్వాత కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్నారు. కాగా నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31న ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగ తి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. హస్తిన రహదారులపై ‘ఈ-కార్టు’లు: నగర రోడ్లపై ఈ-కార్ట్’ అనే కొత్త రకం వాహనాలను అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రిక్షాల్లో నలుగురు వ్యక్తులు, 40 కేజీల లగేజీని అనుమతిస్తుండగా, ఈ-కార్ట్‌లను కేవలం సరుకుల రవాణాకు వాడనున్నారు. ఇందులో 310 కేజీల వరకు బరువైన సరుకులను తరలించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఈ కేటగిరీ కింద అనుమతించనున్న వాహనాలు ప్రభుత్వ ఆమోదిత సంస్థలు నిర్వహించే భద్రత పరీక్షలకు తట్టుకోవాలని, తగిన ప్రామాణికాలను కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ వాహనాలు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించాయని ఢిల్లీ హైకోర్టు నమ్మిన మీదటే రహదారులపైకి వచ్చే అవకాశముంది. అయితే నమూనా పరీక్షల విషయమై రోడ్డు భద్రతా నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
పది రోజుల్లో ఈ- రిక్షాలు
ఈ రిక్షాలకు మళ్లీ మంచిరోజులు రానున్నాయి.. వాటిని రోడ్లమీదకు అనుమతించేందుకు అవసరమైన విధి విధానాల రూపకల్పనలో కేంద్రం బిజీగా ఉంది... అన్నీ సక్రమంగా జరిగితే మరో పదిరోజుల్లో ఢిల్లీ రోడ్లపై ఈ రిక్షాల సంచారాన్ని చూడవచ్చు... సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ రోడ్లపై ఈ రిక్షాలు మళ్ల్లీ దర్శనమివ్వనున్నాయి. రానున్న పది రోజులలో ఈ రిక్షాలపై నోటిఫికేషన్ జారీ చేసి వాటిని రోడ్లపైకి తెస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసిన సందర్భంగా వంద రోజుల్లో తన మంత్రిత్వశాఖ విజయాలను తెలియచేయడం కోసం సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్ గడ్కరీ ఈ విషయం చెప్పారు. ఈ రిక్షాల కోసం కొత్త నియమనిబంధనలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. పది రోజులలో ప్రక్రియను పూర్తి చే సి నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆయన చెప్పారు. కాగా, ఈ రిక్షాలకు సంబంధించిన నియమ నిబంధనలు రవాణా మంత్రిత్వశాఖ రూపొందిస్తోందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో పది రోజులు పడుతుందని అంటున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఈ రిక్షాలు మళ్లీ రోడ్ల పైకి వస్తాయని అంటున్నారు. ఇదిలా ఉండగా, జాతీయ రాజధానిలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ గత జూలై 31వ తేదీన ఈ రిక్షాలు రోడ్లపై సంచరించడాన్ని హై కోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్లపై ఈ రిక్షాల సంచారం వల్ల ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలను తయారుచేస్తున్నామన్నారు. వాటికి చట్టపరమైన రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ రిక్షాలను నిషేధించడం వల్ల వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సమస్యను సత్వరమే పరిష్కరించడానికి కృషిచేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఈ రిక్షాల సంచారంపై త్వరలోనే స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందిస్తామని, అంతవరకు వాటిని రోడ్లపై తిరగడానికి అనుమతించాలని ఈ నెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే విధివిధానాల రూపకల్పన తర్వాతే వాటిని రోడ్లపైకి అనుమతిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ రిక్షాలను నగర రోడ్లపై అనుమతించడానికి ఎటువంటి విధివిధానాలను రూపొందించాలనేది కేంద్ర ప్రభుత్వం విచక్షణకే వదిలేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. 17న ఈ రిక్షా చోదకుల ‘జైల్ భరో’ ఇదిలా ఉండగా, ఈ రిక్షాలపై నిషేధం తొలగించనట్లయితే ఈ నెల 17న జైల్ భరో ఆందోళన చేపడ్తామని ఈ రిక్షా చోదకులు హెచ్చరించారు. సెప్టెంబర్ 16 వరకు ఈ రిక్షాలపై తన వైఖరి తెలియచేయాలని ఈ రిక్షా యజమానుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేనట్లయితే సెప్టెంబర 17న జైల్ భరో ఆందోళన చేపడ్తామని హెచ్చరించింది. ఈ రిక్షాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తాము పలుమార్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టలేదని ఈ రిక్షా చోదకులు అంటున్నారు. -
సమతుల్యత సాధిస్తాం
న్యూఢిల్లీ: ఈ-రిక్షాల వివాదంపై తన వాదనను సమర్థించుకుంటూ... పేదవాడి ఉపాధి, భద్రతా పరిమితులమధ్య ప్రభుత్వం సమతుల్యతను సాధించాల్సిన అవసరముందని కేంద్ర రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమానవీయంగా అనిపించే లాగుడు రిక్షాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ-రిక్షాలను నగర రహదారులపై తిరిగేందుకు అనుమతించామన్నారు. చట్టం గట్టిగా ఉండాల్సిందేనని, అయితే సామాన్య పౌరుడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. అందువల్లనే ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధిస్తామన్నారు. నగర రహదారులపై చట్టవిరుద్ధంగా సంచరిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది జూలై 31వ తేదీన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి విదితమే. వీటి వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. వాటిపై నియంత్రణ విధించేదాకా నిషేధం ఎత్తివేయలేమంటూ గత నెల ఐదో తేదీన ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ-రిక్షావాలాల జీవనోపాధి దెబ్బతింది. నియంత్రణకు సంబంధించి ముసాయిదాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగర రహదారులపై ఈ-రిక్షాలను అనుమతించాలా లేక మోటారు వాహనాల చట్టం కింద కచ్చితంగా వాటిపై ఆంక్షలు విధించాలా అనే విషయమై ఈ నెల తొమ్మిదో తేదీన తన నిర్ణయాన్ని వెలువరించనుంది. అభిప్రాయాల్ని సేకరిస్తాం ఈ వివాదంపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ తెలిపారు. ఆ తరువాత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తాజా బిల్లును సభలో ప్రవేశపెడతామన్నారు. -
ఈ-రిక్షాలపై 28 వరకు నిషేధం కొనసాగింపు
న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం ఈ నెల 28వ తేదీవరకు కొనసాగుతుందని గురువారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఈ -రిక్షాలను తిప్పుకునేందుకు నిర్వాహకులు అనుమతి కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.ఈ-రిక్షాలపై కేంద్రం ఇచ్చిన మధ్యంతర నిబంధనలకు అనుగుణంగా వాటిని నగరంలో తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. అయితే ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, ప్రభుత్వం పూర్తిస్థాయి నియమ నిబంధనలు రూపొందిచేంతవరకు ఈ-రిక్షాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ-రిక్షా నిర్హాహకుల కోసం ప్రభుత్వం ఏమైనా చేయదలిస్తే వారు విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు న్యాయమూర్తుల బెంచ్ సూచించింది. కాగా, ఈ మేరకు కోర్టునుంచి కేంద్రానికి సూచనలు చేయాలని ఏఎస్జీ అభ్యర్థించారు. ఈ-రిక్షా డ్రైవర్లు, నిర్హాహకులకు తగిన సాయం చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని, ప్రస్తుతం తగిన సమయం లేనందున కోర్టు జోక్యాన్ని కోరుతున్నామని ఆమె తెలిపారు. అయితే దీనిపై వచ్చే విచారణ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతకుముందు కోర్టులో న్యాయవాదులమధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తాము మరో రెండు నెలల్లో ఈ-రిక్షాలను మోటార్ వెహికల్స్ చట్టం కిందకు తీసుకువస్తూ విధివిధానాలు రూపొందిస్తామని, అంతవరకు వాటిని రోడ్లపై తిరిగేందుకు అనుమతించాలని హైకోర్టును కేంద్రం కోరింది. దీనిపై ఈ-రిక్షాలను నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన షహవాజ్ఖాన్ తరఫు న్యాయవాది సుగ్రీవ్ దూబే మాట్లాడుతూ ..రాష్ట్రంలో రెండేళ్లుగా చట్టవిరుద్ధంగా తిరుగుతున్న ఈ-రిక్షాల నిర్హాహకులను కట్టడి చేయలేకపోయిన ప్రభుత్వం రెండు నెలల్లో ఏం కట్టడి చేస్తుందని ప్రశ్నించారు. ఈ వాహనాల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటమే కాకుండా, ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయన్నారు. ఈ సందర్భంగా బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు ఆర్కే కపూర్ మాట్లాడుతూ.. ఈ -రిక్షాలు పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఎంతో సహాయకారిగా ఉంటున్నాయని, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని వాహనాలని పేర్కొన్నారు. అలాగే ఈ- రిక్షాలు చట్టాన్ని ఎన్నడూ అతిక్రమించలేదని వాదించారు. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ-రిక్షాల నిర్వహణకు అవకాశం లేనందువల్లే కోర్టును మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నట్లు ఏఎస్జీ తెలిపారు. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఆగస్టు 28వ తేదీవరకు ఈ-రిక్షాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
మరి ఇక్కడ మేమెందుకు?
న్యూఢిల్లీ: మూడుచక్రాల స్కూటర్ రిక్షాలుగా ఈ-రిక్షాలను తిప్పుకునేందుకు అనుమతి ఇస్తే ఇక కోర్టులు నిషేధం విధించడమెందుకు? కోర్టులో న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడమెందుకు? అని హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 1 వరకు ఈ-రిక్షాలను మూడు చక్రాల స్కూటర్ రిక్షాలుగా నగరంలో తిప్పుకునేందుకు అనుమతి ఇచ్చే పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ-రిక్షాల సంఘం తరఫు న్యాయవాది ఆర్కే కపూర్ ఈ విషయమై మాట్లాడుతూ... ప్రస్తుతం నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం విధించారని, అప్పటిలోగా మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని, అయితే సెప్టెంబర్ 1 వరకు ఈ-రిక్షాలను మూడు చక్రాల స్కూటర్ రిక్షాలుగా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరిన సందర్భంగా ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఒకవేళ మీరు కోరినట్లు అనుమతి ఇస్తే ఇక నిషేధం విధించడమెందుకు? అని న్యాయమూర్తులు బదార్ దురేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ-రిక్షాలు ఏ రకమైన వాహనమో తేల్చి చెప్పేందుకు మూడు నెలల సమయముందని కోర్టు తెలిపింది. అందుకే కోర్టు అప్పటి వరకు ఈ-రిక్షాలపై నిషేధం విధించిందని, దానిని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా గత మార్చిలో విడుదల చేసిన మరో ప్రకటన ప్రకారం.. ఈ రిక్షాలను కొనుగోలు చేసినవారు వాణిజ్య వాహనంగా గుర్తింపు పొందుతూ రాష్ట్ర రవాణా విభాగం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అలా అనుమతులు పొందని వాహనాలపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రభుత్వాలు జారీ చేసిన ప్రకటనలు అమలు అవుతున్నాయా? వాటి అమలు తీరు ఎలా ఉందనే విషయమై కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీనికి అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఈ రిక్షాలకు వాణిజ్య వాహనాలకుగా లెసైన్సులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రస్తుతానికి తాత్కాలిక విధివిధానాలు రూపొందించి, అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో శాశ్వత విధానాలు రూపొందిస్తామన్నారు. ఇదిలాఉండగా ఈ-రిక్షాలు నగర రహదారులపై తిరగడాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్పొరేషన్లు వీటిపై నిషేధం విధించాయి. హైస్పీడ్ రహదారులపై కాకుండా చిన్న చిన్న గల్లీ రోడ్లలో మాత్రమే వీటిని నడుపుకోవాలని కార్పొరేషన్ సూచించింది. వాహనంలో ఎక్కించుకునే ప్రయాణికుల విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టతనివ్వలేదు. ఈ గందరగోళాన్ని సవాలు చేస్తూ ఈ రిక్షాల సంక్షేమ సంఘం తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇప్పటిదాకా ఈ-రిక్షాల విషయంలో ఎటువంటి విధివిధానాలు లేనందున వాటిపై నిషేధం కూడా విధించడం కుదరదని, వాటిని మూడు చక్రాల స్కూటర్ రిక్షాలుగా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. -
ఈ రిక్షాలు దోచేస్తున్నాయ్
న్యూఢిల్లీ: గడిచిన రెండేళ్లలో ఈ-రిక్షాలు సుమారు రూ.430 కోట్ల విలువైన విద్యుత్‌ను దొంగిలించాయని డిస్కంలు ఆరోపిస్తున్నాయి. నిషేధం విధించక ముందు నగరంలో కొన్ని వేల ఈ రిక్షాలు కార్యకలాపాలు నిర్వహించేవి. కాగా వీటిని ఎక్కడ రీచార్జి చేస్తుండేవారనే విషయంపై ఎవరూ అంతగా దృష్టిపెట్టలేదు. అయితే చాలావరకు ఈ రిక్షాల యజమానులు వీధి దీపాలు, విద్యుత్ లైన్లకు కొంకీలు వేసి దొంగతనంగా రీచార్జి చేస్తున్నారని డిస్కంలు ఆరోపిస్తున్నాయి. ఆయా ఈ రిక్షాలకు ఎక్కడ నుంచి రీచార్జి చేస్తున్నారనే విషయమై ఎటువంటి తనిఖీలు లేకపోవడంతో విచ్చలవిడిగా విద్యుత్ చోరీ కి గురయ్యేదని డిస్కం యాజమాన్యాలు విమర్శించాయి. జూలై 31 న హైకోర్టు నిషేధం విధించినంతవరకు నగరంలో సుమారు లక్ష ఈ రిక్షాలు సంచరించేవి. ఒక్కో రిక్షాకు రోజుకు సుమారు 10 యూనిట్ల విద్యుత్ అవసరమయ్యేది. పది కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ విద్యుత్ అవసరమవుతుంది. చాలావరకు ఈ రిక్షాలు రోజూ కనీసం 80 కిలోమీటర్ల వరకు తిరుగుతుండేవి. ఈ లెక్కన నెలకు రూ.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ.216 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను ఈ రిక్షాలు అక్రమంగా వాడుకునేవని డిస్కం అధికారులు లెక్క తేల్చారు. ఒకసారి ఈ రిక్షాను రీచార్జి చేస్తే 8 గంటల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఈ సమయం ఆ రిక్షా సుమారు 80 కిలోమీటర్ల పాటు తిరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. ‘ఈ రిక్షాలను రీచార్జి చేయడానికి ఒక విద్యుత్ మాఫియా నగరంలో నడుస్తోంది. వారందరూ విద్యుత్ స్తంభాలు, ఎలక్ట్రిక్ లైన్ల వద్ద ఎప్పుడూ తిరుగాడుతుంటారు. ఈ రిక్షాలు అక్కడికి చేరగానే వాటికి తాము అప్పటికే ఏర్పాటుచేసిన అక్రమ లైన్లతో రీచార్జి చేస్తారు. అలాగే అనధికార కాలనీల్లో వెలసిన ఇళ్ల వద్ద కూడా అక్రమంగా కనెక్షన్లు ఏర్పాటుచేసి ఈ రిక్షాలకు రీచార్జి చేస్తున్నారు. వీటికి వాళ్లు రోజుకు రూ.50 వరకు వసూలు చేస్తారు..’ అని ఒక డిస్కం అధికారి తెలిపారు. కొంత కాలం కిందట విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న ఈ రిక్షాలపై కేశవ్‌పురం, సివిల్ లైన్స్, రఘుబీర్‌నగర్, మాదిపూర్, తూర్పు సాగర్పూర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.. రఘుబీర్‌నగర్‌లో పీ, ఎన్ బ్లాక్‌లలో విద్యుత్ చోరీ మరీ అధికంగా జరిగేది. అక్కడ ఒక్కో విద్యుత్ పోల్ నుంచి ఒకేసారి 20 వరకు ఈ రిక్షాలకు రీచార్జి చేస్తుండేవారు. కొన్ని వందల ఈ రిక్షాలు అక్కడ లైన్లలో కనిస్తుండేవి..’ అని ఆయన వివరించారు. కాగా, ఈ రిక్షాల విద్యుత్ అక్రమ వినియోగంపై నిఘా పెట్టడం చాలా కష్టమని డిస్కం అధికారులు అంటున్నారు. ‘చాలా ఈ రిక్షాలను ఇళ్లవద్దే చార్జింగ్ చేస్తుంటారని వారు చెబుతున్నారు. ‘ఈ రిక్షాలనేవి కొత్తగా వచ్చాయి. వాటికి విద్యుత్ వినియోగంపై ఇప్పటివరకు ఎటువంటి నిబంధనలను మేం రూపొందించలేదు. త్వరలో రూపొందించే టారిఫ్ ఆర్డర్లో ఈ రిక్షాలకు సంబంధించి నియమనిబంధనలను రూపొందించబోతున్నాం. వాటిని డిస్కంలు అనుమతించిన పోర్టల్స్ నుంచే చార్జింగ్కు అనుమతించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సాధారణంగా ఈ రిక్షాలకు వాణిజ్యపరమైన ధరలను తీసుకోనున్నాం. అయితే వాటిని ఇళ్లవద్దే చార్జింగ్ పెట్టుకుండటంతో గృహ వినియోగ చార్జీలు మాత్రమే చెల్లిస్తున్నారు..’ అని ఢిల్లీకి చెందిన టాటా పవర్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆటోమొబైల్ దుకాణాలకు ఇప్పుడు ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఈ రిక్షా డ్రైవర్లకు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వారికి పార్కింగ్‌తోపాటు చార్జింగ్ నిమిత్తం రూ.100 -150 లను కొందరు ఆటోమొబైల్ దుకాణదారులు వసూలు చేస్తున్నారు. ‘ఒక్కో వాహనానికి నాలుగు బ్యాటరీలుంటాయి. ఒక్కో బ్యాటరీని పూర్తిగా చార్జింగ్ చేయాలంటే 12 వోల్ట్ల విద్యుత్ అవసరమవుతుంది. దీనికి సుమారు 8 గంటల సమయం పడుతుంది...’ అని దుకాణదారులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టం కిందకు ఈ రిక్షాలు సాక్షి, న్యూఢిల్లీ: ఈ రిక్షాలపై నిషేధాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచారణ కొనసాగించనుంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ రిక్షాల నియంత్రణకు రూపొందించిన మార్గదర్శకాలను న్యాయస్థానం ముందుంచనుంది. ఈ రిక్షాల నియంత్రణ కోసం మోటారు వాహనాల చట్టం కింద వాటి కోసం ప్రత్యేక నిబంధన రూపొందిం చినట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం ఈ రిక్షాలకు రిజిస్ట్రేషన్, లెసైన్స్ అవసరమవుతాయి. అయితే వాటిని పొందే ప్రక్రియ సులభంగా ఉంటుంది. వాహన భద్రతా అంశాలను, ఈ రిక్షా చోదకుల జీవనోపాధి సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రవాణా శాఖ అధికారులు ఈ నిబంధన రూపొందించినట్లు చెబుతున్నారు. వీటి వేగం గంటకు 25 కి.మీ.మించరాదని, నలుగురి కన్నా ఎక్కువ మందిని కూర్చోబెట్టరాదని, 50 కిలోల కన్నా ఎక్కువ లగేజీని అనుమతించరాదని కూడా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. నగరంలో ఎన్ని ఈ రిక్షాలను అనుమతించాలి.. వాటిని ఏయే రూట్లలో అనుమతించాలనే అంశాలను అధికారులు పౌరసంస్థలకే వదిలివేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ రిక్షాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రిక్షా డ్రైవర్లు గురువారం జంతర్‌మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. నియంత్రణ లేకుండా రోడ్లపై తిరుగుతోన్న ఈ రిక్షాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని, నియంత్రణలు రూపొందించేంతవరకు వాటిని అనుమతించడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. -
మార్గదర్శకాల తర్వాతే మనుగడ
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఈ రిక్షాలపై గతంలో విధించిన నిషేధాన్ని తొలగించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ రిక్షాలపై నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రిక్షాలపై నిషేధం విధిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బి.డి. అహ్మద్, సిద్ధార్థ్ మదుల్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ రిక్షాల నియంత్రణకు సరైన మార్గదర్శకాలు లేకుండా వాటి ని నగరరోడ్లపై అనుమతించబోనని న్యాయస్థానం తెలిపింది. తాను ఈ రిక్షాలకు వ్యతిరేకం కానని అయితే వాటిపై నియంత్రణ అవసరమని అభిప్రాయపడిన న్యాయస్థానం ఈ రిక్షాల నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు ప్రకటించింది. ఎలాంటి సమస్య లేకుండా ఈ రిక్షాలు రోడ్లపై తిరగడం కోసం ప్రస్తుత ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందని, రెండు రోజుల్లో నిబంధనల ముసాయిదాను న్యాయస్థానం ఎదుట ఉంచుతామని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ న్యాయస్థానానికి తెలిపారు. దానికి అంగీకరించిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై ఆగస్టు 8న తిరిగి విచారణ జరుపుతామని పేర్కొంటూ ఈ రిక్షాలపై నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను తన ముందుంచాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, నగరంలో ఈ-రిక్షాలపై తక్షణం నిషేధం విధిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 31న ఉత్తర్వు జారీచేసింది. ఈ-రిక్షాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణ జరిపేంతవరకు అంటే ఆగస్టు 14 వరకు ఈ-రిక్షాలను రోడ్లపై తిరగనీయరాదని న్యాయస్థానం ఆదేశించింది. నియంత్రణలేకుండా నగరరోడ్లపై తిరిగే ఈ-రిక్షాలు ట్రాఫిక్ సమస్యగా, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. వాటిని వెంటనే నిలిపివేయడం కోసం చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. ఈ వాహనాల్లో ఎంత బరువు తీసుకెళ్లాలి, ఎంత మంది ప్రయాణికులను కూర్చోబెట్టుకోవాలి అనే వాటిపై నిర్దిష్టమైన ఆదేశాలు లేవని, కనీసం రిజిస్ట్రేషన్, బీమా లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. తగిన నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా నడిచే ఈ-రిక్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వీటి వల్ల ఇది వరకే 29కిపైగా రోడ్డు దుర్ఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని నితిన్ గడ్కరీ గత నెల 17న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం తెలిసిందే. ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామానును తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల్ కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ-రిక్షా పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. -
ఈ-రిక్షాలపై నేడు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై నిషేధాన్ని విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై మంగళవారం విచారణ జరపడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్ ధర్మాసనం ఎదుట బ్యాటరీ రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ గురించి న్యాయవాది ఆర్.కె. కపూర్ సోమవారం ప్రస్తావించారు. ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై తక్షణం విచారణ జరపాలన్న కపూర్ విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించింది. అయితే ఈ-రిక్షాలను నియంత్రించవలసిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. తగిన నియంత్రణ లేనంత వరకు ఈ-రిక్షాలను అనుమతించలేమని న్యాయమూర్తులు పేర్కొంటూనే తమ ఉత్తర్వును సమీక్షించాలని కోరిన పిటిషన్‌పై విచారణ జరపడానికి అంగీకరించారు. బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాల నియంత్రణకు సంబంధించి కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యద ర్శులకు లేఖ రాసింది. కాబట్టి వాటిపై నిషేధాన్ని తక్షణం సమీక్షించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం కోరింది. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలనుకుంటోందని, ఆ తరువాత ఈ-రిక్షాల నియంత్రణకు మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేయనుందని పిటిషన్ పేర్కొంది. అంతవరకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు లేదా పౌర సంస్థలు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ-రిక్షాలను అనుమతించాలని పిటిషన్ కోరింది. జీవనోపాధి కోసం ఈ-రిక్షాలపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిపై నిషేధం విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తక్షణం సమీక్షించాలని లేదా సవరించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. నగరంలో ఈ-రిక్షాలపై తక్షణం నిషేధం విధిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 31న ఉత్తర్వు జారీచేసింది. ఈ-రిక్షాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణ జరిపేంతవరకు అంటే ఆగస్టు 14 వరకు ఈ-రిక్షాలను రోడ్లపై తిరగనీయరాదని న్యాయస్థానం ఆదేశించింది. నియంత్రణలేకుండా నగరరోడ్లపై తిరిగే ఈ-రిక్షాలు ట్రాఫిక్ సమస్యగా, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. వాటిని వెంటనే నిలిపివేయడం కోసం చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. ఈ వాహనాల్లో ఎంత బరువు తీసుకెళ్లాలి, ఎంత మంది ప్రయాణికులను కూర్చోబెట్టుకోవాలి అనే వాటిపై నిర్దిష్టమైన ఆదేశాలు లేవని, కనీసం రిజిస్ట్రేషన్, బీమా లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. తగిన నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా నడిచే ఈ-రిక్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వీటి వల్ల ఇది వరకే 29కిపైగా రోడ్డు దుర్ఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని నితిన్ గడ్కరీ గత నెల 17న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం తెలిసిందే. ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామానును తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల్ కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ-రిక్షా పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. -
ఈ-రిక్షాలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఎలక్ట్రానిక్ రిక్షా (ఈ-రిక్షా)లపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. రాజధాని రోడ్లపై ఆగస్టు 14 వరకు ఈ-రిక్షాలను తిరగ నివ్వకూడదని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వాహనాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) విచారణ జరుపుతున్న హైకోర్టు బెంచ్ పైనిర్ణయం తీసుకుంది. ఈ-రిక్షాలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని, వాటి వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ కేసుపై ఆగస్టు 14న తిరిగి విచారణ జరిపిన తరువాతే న్యాయస్థానం తుదినిర్ణయం తీసుకోనుంది. ఈ-రిక్షాలు నియమనిబంధనలు లేకుండా నడుస్తున్నాయని, వీటిని వెంటనే నిషేధించాలన్న ప్రభుత్వం, పిటిషనర్ వాదనతో న్యాయమూర్తులు బీడీ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. వీటి నియంత్రణకు చట్టం చేసేంత వరకు వీటి సంచారాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ-రిక్షా డ్రైవర్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరాదని పేర్కొంది. నగర రోడ్లపై ఈ-రిక్షాలు నడవకుండా ఉండేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసు గురువారం విచారణ సందర్భంగా కాసేపు వాదోపవాదాలు జరిగాయి. ఢిల్లీలో ఈ-రి క్షాలు అక్రమంగా నడుస్తున్నాయని, ఇవి నిబంధనలను పాటించడం లేదని పిల్ దాఖలు చేసిన వ్యక్తి తరఫు న్యాయవాది సుగ్రీవ్ దూబే న్యాయస్థానానికి తెలిపారు. వీటిని మోటారు వాహనాల చట్టం పరిధి నుంచి మినహాయించడానికి చట్టాన్ని సవరించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ రాసిన లేఖను ప్రభుత్వం తరపు న్యాయవాది జుబేదా బేగం న్యాయస్థానానికి సమర్పించారు. స్థానిక సం స్థలు ఈ-రిక్షాలను నియంత్రించేందుకు నిబంధన లు రూపొందిస్తాయని పేర్కొంటూ మంత్రిత్వశాఖ రాసిన లేఖ ప్రతిని ఆమె సమర్పించారు. అయితే వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై న్యాయస్థానం స్పందించడానికి నిరాకరిం చింది. ప్రస్తుతం ఈ-రిక్షాలను నడపడం అక్రమమని న్యాయస్థానం అభిప్రాయపడింది. తిలోక్పురిలో రెండురోజుల కింద ఈ-రిక్షా ఢీకొనడంతో తల్లి ఒడిలో నుంచి జారిపడిన బాలుడు చక్కెరపాకంలో పడి మరణి ంచడాన్ని కూడా న్యాయస్థానం పరిగ ణనలోకి తీసుకుంది. ఈ వాహనాల్లో ఎంత బరువు తీసుకెళ్లాలి, ఎంత మంది ప్రయాణికులను కూర్చోబెట్టుకోవాలి అనే వాటిపై నిర్దిష్టమైన ఆదేశాలు లేవని, కనీసం రిజిస్ట్రేషన్, బీమా లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. తగిన నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా నడిచే ఈ-రిక్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, వీటి వల్ల ఇది వరకే 29కిపైగా రోడ్డు దుర్ఘటనలు జరిగాయని ట్రాఫిక్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలపై డ్రైవర్లకు తగిన నియంత్రణ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలను కలిగిస్తూ తోటి ప్రయాణికులకు తరచూ ఇబ్బంది కలిగిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వీటిని నడిపే డ్రైవర్ల వివరాలను కూడా పరిశీలించే విధానం లేదని వివరించారు. డ్రైవరు సహా నలుగురు మాత్రమే కూర్చుని ప్రయాణించేలా ఈ-రిక్షాలను డిజైన్ చేసినప్పటికీ వాటిలో ఎనమిది మందిని కూర్చోబెట్టి నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటితో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నందున నిషేధించాలని షానవాజ్ ఖాన్ అనే సామాజిక కార్యకర్త ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని నితిన్ గడ్కరీ గత నెల 17న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించడం తెలిసిందే. ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామానును తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల్ కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ-రిక్షా పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్ దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అయితే, హైకోర్టు తీర్పుతో బీజేపీ కొంత ఇరకాటంలో పడినట్ల య్యింది. ఇప్పుడు కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకు వస్తే తప్ప ఈ రిక్షాల మనుగడ కష్టసాధ్యమని వాటి యజమానులు అంటున్నారు. కాగా, ఈ -రిక్షా డ్రైవర్ల బాగుకోసం బీజేపీ నాయకత్వం చేసిందేమీ లేదని ఆప్ ఆరోపించింది. ప్రస్తుత కోర్టు ఆదేశంతో రోడ్డున పడబోతున్న డ్రైవర్ల బాధ్యత బీజేపీదేనని ఆప్ నాయకులు హెచ్చరించారు.త బీజేపీదే బాధ్యత: డీపీసీసీ విమర్శ నగరంలో ఈ - రిక్షాలపై హైకోర్టు నిషేధం విషయంలో బీజేపీదే బాధ్యత అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. నగర రోడ్లపై ఈ రిక్షాలు తిరగకూడదని గురువారం ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. కాగా, దీనిపై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించడంలో బీజేపీదే బాధ్యత అని ఆరోపించారు. ఒకవేళ నగరంలో ఈ రిక్షాలను శాశ్వతంగా నిషేధిస్తే సుమారు పది లక్షలమంది రోడ్డున పడతారని ఆయన అన్నారు. ఈ-రిక్షాలకు రక్షణ కల్పిస్తామని కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని, ఈ మేరకు నగరంలో ఆర్భాటంగా పోస్టర్లు కూడా అతికించారన్నారు. నిజానికి బీజీపీ, ఆప్‌లు ఈ-రిక్షాలకు వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. ఆటో డ్రైవర్లతో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ సమావేశం ఒక నాటకమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ విమర్శించారు. ఆటోరిక్షా డ్రైవర్లలో ఎక్కువ మంది ఈ కేజ్రీవాల్ ర్యాలీకి దూరంగా ఉన్నారని ఆయన అన్నారు. రాష్ర్ట కాంగ్రెస్ నాయకుల బృందం గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్‌ను కలిసి ఈ-రిక్షా డ్రైవర్లకు అనుకూలంగా ఆర్డినెన్స్ తేవాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. -
ఈ-రిక్షాలను రక్షిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు మంగళవారం నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్నారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామాన్లను తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ వాహనాల పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్‌దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ-రిక్షావాలాల సమస్యల గురించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడానని గడ్కరీ తెలిపారు. ఈ వాహనాల యజమానులకు మూడు శాతం వడ్డీరేటుతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రికి కూడా లేఖరాసినట్లు ఆయన చెప్పారు. ఈ-రిక్షాల్లో నలుగురిని మాత్రమే కూర్చోబెట్టుకోవాలని ఆయన సూచించారు. డ్రైవర్లు ఎనిమిది మందిని కూర్చోబెట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన చెప్పారు. నలుగురు ప్రయాణీకులతోపాటు 25 -50 కిలోల బరువున్న సామాన్లను తీసుకెళ్లవచ్చని గడ్కరీ వివరించారు. మంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్న నిపుణులు ఈ-రిక్షాల సమస్యను రాజకీయం చేయవద్దంటూనే వాటికి వరాలు కురిపిస్తూ గడ్కరీ చేసిన ప్రకటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ-రిక్షాలపై నిసేధం విధించబోమని హామీ ఇవ్వడంపై రోడ్డు రవాణా నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నియంత్రణ లేకపోవడం ఢిల్లీరోడ్లపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆక్షేపిస్తున్నారు. నగరంలో 25 వేల ఈ-రిక్షాలున్నాయని అంచనా. లెసైన్సులు, రిజిస్ట్రేషన్లు, నంబరు ప్లేట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల వంటివి లేకుండా రోడ్లపై తిరుగుతోన్న ఈ-రిక్షాలపై నిషేధం విధించాలని గత సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కోర్టు జోక్యంతో ఢిల్లీ సర్కారు ఈ-రిక్షాల వ్యవహారాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంతిత్వశాఖకు పంపింది. దీంతో కేంద్రం మోటారు వాహనాల చ ట్టాన్ని సవరించింది. అనుమతిలేకుండా ఈ-రిక్షాలు నడపడం చట్టవిరుధ్ధమని పేర్కొంటూ ఏప్రిల్ 24 నోటిఫికేషన్ జారీ చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో గత వారం రోజులుగా రవాణా విభాగం, ట్రాఫిక్ పోలీసులు ఈ-రిక్షాలపై కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. దీంతో ఈ-రిక్షావాలాలు నిరసనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రిక్షావాలాలకు మద్దతుగా నిలిచి వారిపై చర్యలు తీసుకోవద్దని ఎల్జీని సోమవారం కోరారు. ఢిల్లీవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది ఈ-రిక్షాలను నడుపుతున్నారు. వీటిని నిషేధిస్తే లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతారని కే జ్రీవాల్ విలేకరులతో అన్నారు. ఈ-రిక్షాల నోటి ఫికేషన్ల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నందున తీర్పు వెలువడేంత వరకు ఈ-రిక్షాలపై చలాన్లు విధించ కూడదని, జప్తు చేయకూడదని తాము ఎల్జీని కోరామని ఆయన చెప్పారు.